సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Baby Do Die Do: దేశీ హిట్ ఉమన్ గా హ్యూమా ఖురేషీ

ABN, Publish Date - Jun 09 , 2026 | 06:33 PM

దేశీ హిట్‌ ఉమెన్‌గా హ్యూమా ఖురేషీ నటిస్తున్న చిత్రం ‘బేబీ డూ డై డూ’. మిస్టరీ థ్రిల్లర్‌ కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రానికి నచికేత్‌ సామంత్‌ దర్శకుడు.

దేశీ హిట్‌ ఉమెన్‌గా హ్యూమా ఖురేషీ (Huma Qureshi) నటిస్తున్న చిత్రం ‘బేబీ డూ డై డూ’ (baby Do Die do) మిస్టరీ థ్రిల్లర్‌ కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రానికి నచికేత్‌ సామంత్‌ దర్శకుడు. తాజాగా ఈ సినిమా టీజర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ విషయాన్ని తరణ్‌ ఆదర్శ్‌ ఎక్స్‌ వేదికగా తెలిపారు. టీజర్‌లో హ్యూమా ఖురేషీ ‘బేబీ కర్‌మార్కర్‌’ అనే ఆసక్తికరమైన పాత్రలో కనిపిస్తూ ఆకట్టుకుంటున్నారు. భారతీయ సినీ తెరపై తొలి దేశీ హిట్‌ ఉమన్‌గా ఆమె పాత్రను రూపొందించినట్లు టీజర్‌ చూస్తే తెలుస్తోంది. సస్పెన్స్‌, థ్రిల్‌, డార్క్‌ హ్యూమర్‌ అంశాల మేళవింపుతో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లనుందని మేకర్స్‌ చెబుతున్నారు. సాకిబ్‌ సలీమ్‌ నిర్మిస్తున్న ఈ సినిమా జూలై 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

Updated Date - Jun 09 , 2026 | 06:38 PM