సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

హాలీవుడ్‌ స్టార్‌తో హృతిక్‌ ముఖాముఖి..

ABN, Publish Date - Mar 26 , 2026 | 12:16 AM

బాలీవుడ్‌ స్టార్‌ హృతిక్‌ రోషన్‌ (Hrithik Roshan) హాలీవుడ్‌ సినిమా ప్రమోషన్‌లో భాగమైన సంగతి తెలిసిందే!

బాలీవుడ్‌ స్టార్‌ హృతిక్‌ రోషన్‌ (Hrithik Roshan) హాలీవుడ్‌ సినిమా ప్రమోషన్‌లో భాగమైన సంగతి తెలిసిందే! శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానున్న హాలీవుడ్‌ చిత్రం ‘ప్రాజెక్ట్‌ హెయిల్‌ మేరీ’ (Project Hail Merry) చిత్రం కోసం ఇప్పటికే ఆసక్తికర వీడియోలు చేసిన  హృతిక్‌ ఇప్పుడు హీరో ర్యాన్‌ గాస్లింగ్‌తో వర్చువల్‌గా ముఖాముఖి అయ్యారు. స్పేస్‌, సైన్స్‌, సినిమాలపై తమకున్న ఆసక్తిని ఇద్దరూ షేర్‌ చేసుకున్నారు. ఈ ఇంటర్వ్యూ సోషల్‌ మీడియాలో విపరీతంగా వైరల్‌ అవుతుంది.
వీరిద్దరి చర్చ సైన్స్‌ ఫిక్షన్‌ చిత్రం  ‘ప్రాజెక్ట్‌ హెయిల్‌ మేరీ’ చుట్టూ సాగింది. ఇందులో హృతిక్‌ రోషన్‌ నటించిన ‘కోయి... మిల్‌ గయా’కి ఈ కొత్త చిత్రానికి ఉన్న భావోద్వేగపరమైన పోలికలను గుర్తు చేసుకున్నారు. భవిష్యత్తులో కలిసి పని చేసే ఆలోచనపై చర్చ జరిగింది.  

ఫిల్‌ లార్డ్‌, క్రిస్టోఫర్‌ మిల్లర్‌ దర్శకత్వం వహించిన ‘ప్రాజెక్ట్‌ హెయిల్‌ మేరీ’ చిత్రంలో ర్యాన్‌ గాస్లింగ్‌ మెమరీ లాస్‌కి గురైన రైలాండ్‌ గ్రేస్‌ పాత్రను పోషించారు. అమెజాన్‌ ఎంజీఎం స్టూడియోస్‌ సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్స్‌ పంపిణీ చేస్తోంది. మార్చి 26న ఇంగ్లిష్‌, హిందీ, తమిళ, తెలు భాషల్లో భారతదేశ వ్యాప్తంగా ఐమాక్స్‌, ఇతర ప్రీమియం ఫార్మాట్లలో భారీ ఎత్తున విడుదల కానుంది.

Updated Date - Mar 26 , 2026 | 12:23 AM