సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Jailer 2: రజనీకాంత్ ఇంట్లో హృతిక్ రోషన్ సందడి!

ABN, Publish Date - Jul 12 , 2026 | 11:00 AM

సూపర్‌స్టార్ రజనీకాంత్(Rajinikanth), బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ (Hrithk Roshan) ఒకే ఫ్రేమ్‌లో కనిపించడంతో సినీ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

సూపర్‌స్టార్ రజనీకాంత్(Rajinikanth), బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ (Hrithk Roshan) ఒకే ఫ్రేమ్‌లో కనిపించడంతో సినీ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల 'జైలర్ 2'లో(Jailer 2) తన పాత్రకు సంబందించిన షూట్‌ను పూర్తి చేసిన హృతిక్ రోషన్, రజనీకాంత్ నివాసానికి వెళ్లి ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఇద్దరూ కలిసి దిగిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రెండు వేర్వేరు సినీ పరిశ్రమలకు చెందిన ఈ ఇద్దరు స్టార్‌లు ఒకే ఫ్రేమ్‌లో కనిపించడం అభిమానులకు ప్రత్యేక ఆనందాన్ని కలిగిస్తోంది.

'ఇద్దరు ఐకాన్లు.. ఒకే ఫ్రేమ్‌లో కనిపించడం నిజంగా స్పెషల్' అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో వచ్చిన 'జైలర్' చిత్రానికి  సీక్వెల్ గా 'జైలర్ 2' చిత్రం తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే! ఇందులో హృతిక్ రోషన్ క్యామియో రోల్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో మోహన్ లాల్, శివరాజ్ కుమార్, జాకీ ష్రాఫ్, విజయ్ సేతుపతి కీలక పాత్రధారులు. అక్టోబర్ 15న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. 

ALSO READ:
Sunitha: జానకమ్మతో మధుర క్షణాలు.. సునీత భావోద్వేగ పోస్ట్

Arya: రూ.1.80 కోట్ల బకాయి.. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు

Updated Date - Jul 12 , 2026 | 12:07 PM