సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

సూర్య బాటలో అక్షయ్.. ఇది కదా రియల్ హీరోయిజం అంటే

ABN, Publish Date - Jul 17 , 2026 | 03:59 PM

సినిమాల్లో హీరోలు ఫైట్స్ చేస్తుంటే అలా నోర్లు వెళ్లబెట్టి చూస్తూనే ఉంటాం. అసలు విలన్స్ ని హీరో చితక్కొడుతుంటే ఇంకా కొట్టు .. ఇంకా కొట్టు అని అరుస్తుంటాం. కానీ, ఆ ఫైట్స్ వెనుక రియల్ హీరోలు మనం చూసే హీరోలు కాదు

Akshay Kumar

సినిమాల్లో హీరోలు ఫైట్స్ చేస్తుంటే అలా నోర్లు వెళ్లబెట్టి చూస్తూనే ఉంటాం. అసలు విలన్స్ ని హీరో చితక్కొడుతుంటే ఇంకా కొట్టు .. ఇంకా కొట్టు అని అరుస్తుంటాం. కానీ, ఆ ఫైట్స్ వెనుక రియల్ హీరోలు మనం చూసే హీరోలు కాదు. తెరవెనుక వీరులు స్టంట్‌మెన్లు వేరు. వారిదే అసలు కష్టం. కొంచెం అటు ఇటు అయినా వారి ప్రాణాలు గాల్లోనే ఉంటాయి. ఎప్పుడు ఏ ప్రమాదం వస్తుందో తెలియని జాబ్ చేస్తున్నా.. వారికి మాత్రం కనీసం బీమా రక్షణ కూడా లేదు అంటే అతిశయోక్తి కాదు. సెట్ లో ప్రమాదవశాత్తూ మరణించిన స్టంట్‌మెన్లు చాలామంది ఉన్నారు. అలాంటి వారందరికి నేను ఉన్నాను అని అండగా నిలబడ్డాడు నిజమైన హీరో సూర్య (Suriya).


గత పదేళ్లుగా సూర్య తన సొంత ఫౌండేషన్ అయిన అగరం ద్వారా తమిళ స్టంట్ ఆర్టిస్టులకు ఆదర్శవంతమైన భరోసానిస్తున్నాడు. ప్రతి ఏటా ఒక్కో స్టంట్ ఆర్టిస్టుకు రూ. 10 లక్షల ఇన్సూరెన్స్ కవరేజీ అందేలా ఆయనే స్వయంగా ప్రీమియంలు చెల్లిస్తూ వారి కుటుంబాలకు కొండంత అండగా నిలుస్తున్నాడు. దీనివలన వారి కుటుంబాలు ఆర్థికంగా రోడ్డున పడకుండా కాపాడుతున్నాయి.


ఇక సూర్య బాటలోనే తాను కూడా అంటూ బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ నడుంకట్టాడు. దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 650 మందికి పైగా స్టంట్ ఆర్టిస్టులకు పర్సనల్ గా హెల్త్, యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ చేయించి రియల్ హీరో అనిపించుకున్నాడు. షూటింగ్ సెట్లలో లేదా బయట ఏ ప్రమాదం జరిగినా క్యాష్‌లెస్ పద్ధతిలో రూ. 5 లక్షల నుండి రూ. 5.5 లక్షల వరకు ఉచిత చికిత్స పొందే సౌకర్యాన్ని అక్షయ్ కల్పించాడు. ఈ విషయం తెలియడంతో నెటిజన్స్.. అక్షయ్ కుమార్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇది కదా రియల్ హీరోయిజం అంటే అంటూ కామెంట్స్ పెడుతున్నారు. సూర్య, అక్షయ్ మాత్రమే కాకుండా స్టార్ హీరోలు సైతం ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నారు. అయితే టాలీవుడ్ స్టార్ హీరోలు చాలామంది ఇలా ఇన్సూరెన్స్ కవరేజీలు చేయకపోయినా ఎన్నో గుప్తదానాలు చేశారు. ఏదిఏమైనా ఇలా వ్యవస్థీకృతంగా ఇన్సూరెన్స్ భరోసా కల్పిస్తే అది పదిమందిలో స్ఫూర్తిని నింపుతుందని చెప్పుకొస్తున్నారు.

Updated Date - Jul 17 , 2026 | 03:59 PM