రామాయణ రివ్యూ.. ఇది కూడా పోయినట్టేనా

ABN , Publish Date - Oct 28 , 2026 | 04:58 PM

ఇండస్ట్రీ మొత్తం ఎదురుచూస్తోన్న సినిమాల్లో 'రామాయణం పార్ట్ 1' (Ramayana Part 1) ఒకటి. నితేష్ తివారీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రణబీర్ కపూర్ (Ranbir Kapoor), యశ్(Yash), సాయి పల్లవి, రకుల్ ప్రీత్ సింగ్, కాజల్ అగర్వాల్ లాంటి స్టార్స్ నటించారు.

Ramayana

ఇండస్ట్రీ మొత్తం ఎదురుచూస్తోన్న సినిమాల్లో 'రామాయణం పార్ట్ 1' (Ramayana Part 1) ఒకటి. నితేష్ తివారీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రణబీర్ కపూర్ (Ranbir Kapoor), యశ్(Yash), సాయి పల్లవి, రకుల్ ప్రీత్ సింగ్, కాజల్ అగర్వాల్ లాంటి స్టార్స్ నటించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమా కోసం యావత్ ప్రపంచం ఎంతగానో ఎదురుచూస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన స్పెషల్ ప్రీమియర్ షో లాస్ ఏంజెలెస్‌లోని అకాడమీ మ్యూజియం ఆఫ్ మోషన్ పిక్చర్స్‌లో ఘనంగా జరిగింది. ఈ ప్రత్యేక ప్రీమియర్‌కు దర్శకుడు నితేష్ తివారీతో పాటు ప్రధాన తారాగణం రణబీర్ కపూర్, యశ్, సాయి పల్లవితో పాటు నిర్మాత నమిత్ మల్హోత్రా హాజరయ్యారు.


ఈ స్పెషల్ త్రీడీ స్క్రీనింగ్‌లో ప్రదర్శించిన ఇంగ్లీష్ డబ్ వెర్షన్‌కు సంబంధించి తొలి రివ్యూలు, రెస్పాన్స్ షాకింగ్ గా ఉన్నాయి. సినిమా చూసిన వారి నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. కొంతమంది సినిమా చాలా బావుందని, విజువల్ వండర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారని, గ్రాఫిక్స్, స్కేల్, యాక్షన్ సీక్వెన్స్‌లు హాలీవుడ్ రేంజ్‌లో ఉన్నాయని ప్రశంసిస్తున్నారు. రాముడిగా రణబీర్ కపూర్ అద్భుతమైన అభినయంతో కంటతడి పెట్టించగా, రావణుడి పాత్రలో యశ్ పెర్ఫార్మెన్స్ మేజికల్‌గా ఉందని, సీతాగా సాయిపల్లవి చక్కగా సరిపోయిందని కొనియాడుతున్నారు. కొందరైతే దీన్ని లార్డ్ ఆఫ్ ది రింగ్స్ మొదటి భాగంతో పోలుస్తూ ఇండియన్ స్క్రీన్‌పై ఇదొక ఎపిక్ మూవీ అంటున్నారు.


ఇక మరికొంతమంది మాత్రం నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తున్నారు. ఇతిహాసాన్ని ఎక్కడా చెడగొట్టకుండా తీసినప్పటికీ, కొన్ని చోట్ల సినిమా ఆత్మను కోల్పోయినట్లు అనిపించిందని అభిప్రాయపడుతున్నారు. డ్రామా, ఎమోషన్స్ కంటే విజువల్స్ పైనే ఎక్కువ దృష్టి పెట్టారని, సెకండాఫ్ కొద్దిగా సాగదీసినట్లుఉందని, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఆశించిన స్థాయిలో లేదని అంటున్నారు. అలాగే సాయిపల్లవి పాత్రకు పార్ట్-1లో పూర్తిస్థాయి ప్రాధాన్యం దక్కలేదనే టాక్ వినిపిస్తోంది. అంతేకాకుండా చాలా లోపాలు ఉన్నట్లు కూడా చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం ఈ భారీ బడ్జెట్ చిత్రంపై ఈ ప్రీమియర్ టాక్ ఇప్పుడు టాలీవుడ్, బాలీవుడ్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.


మొదటి నుంచి మిక్స్డ్ టాక్ వచ్చింది అంటే.. కొంచెం కష్టమే అని నెటిజన్స్ చెప్పుకొస్తున్నారు. రామాయణ లాంటి భారీ ప్రాజెక్ట్ ని హ్యాండిల్ చేయడం కత్తిమీద సాము లాంటిది. నితీష్ తివారీ దాన్ని బాగానే హ్యాండిల్ చేసినా.. మిక్స్డ్ టాక్ అందుకుంటే మాత్రం ఇది కూడా పోయినట్టే అని అంటున్నారు. మరి నవంబర్ 5న రామాయణ ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.

Updated Date - Oct 28 , 2026 | 04:58 PM