సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Hanuman Ansh: అప్పుడు పట్టించుకోలేదు.. ఇప్పుడు లేపుతున్నారు

ABN, Publish Date - Sep 04 , 2026 | 09:42 PM

రూ.2 కోట్ల బడ్జెట్‌తో ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఆధ్యాత్మిక చిత్రం ‘హనుమాన్ అంశ్’ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది.

Hanuman Ansh

రూ.2 కోట్ల బడ్జెట్‌తో ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ‘హనుమాన్ అంశ్’ (Hanuman ansh) ఆధ్యాత్మిక చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. మొదటి రోజు కేవలం రూ.10 లక్షల వసూళ్లతో ప్రారంభమై, ఒక దశలో షోలు 250 నుంచి 25కి పడిపోయినా ఈ చిత్రం నిలదొక్కుకుంది. ప్రేక్షకుల మౌత్ టాక్‌తో మూడో వారం నుంచి కలెక్షన్లు ఊపందుకోగా, ప్రస్తుతం ఇది రూ.86 కోట్ల వసూళ్లతో దూసుకుపోతోంది. త్వ‌ర‌లోనే వంద కోట్ల క్ల‌బ్‌లోకి చేరే అవ‌కాశాలు పుష్క‌లంగా ఉన్నాయి.

హిందీ మార్కెట్‌లో నాలుగో వారంలోనూ బలమైన ప్రదర్శన కనబరుస్తూ యష్ ‘టాక్సిక్’ సినిమాను సైతం ఇది అధిగమించింది. అయితే సినిమా విజయవంతమయ్యాక కొందరు బాలీవుడ్ ప్రముఖులు ఫోన్లు చేసి అభినందించడంపై దర్శకుడు విశాల్ చతుర్వేది చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. సినిమా విడుద‌ల స‌మ‌యంలో ఏ ఒక్క‌రు స‌పోర్టు చేయ‌లేద‌ని, దీనిని ఓ సినిమాగా కూడా గుర్తించ‌లేద‌ని అన్నారు. ఇప్పుడు సినిమా విజ‌య‌వంతంగా ప్ర‌ద‌ర్శిత‌మ‌వుతున్న సంద‌ర్భాన్ని పుర‌స్క‌రించుకుని అప్పుడు ప‌ట్టించుకోనివారే ఇప్పుడు అహో ఓహో అంటూ ప్ర‌శంస‌లు కురిపిస్తున్నార‌ని.. కంటెంట్ బలముంటే ఏ చిన్న సినిమానైనా ప్రేక్షకులు విజయవంతం చేస్తారనేందుకు ఈ చిత్రమే తాజా నిదర్శనం.

Updated Date - Sep 04 , 2026 | 11:32 PM