సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

విలన్‌గా అక్షయ్ కుమార్.. ‘హైవాన్’ ఫస్ట్ లుక్ విడుదల

ABN, Publish Date - Jul 16 , 2026 | 08:17 PM

అక్షయ్ కుమార్, సైఫ్ అలీఖాన్ ప్రధాన పాత్రల్లో.. దర్శకుడు ప్రియదర్శన్ రూపొందిస్తోన్న చిత్రం ‘హైవాన్’. ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్‌ని మేకర్స్ విడుదల చేశారు.

Haiwaan First Look

అక్షయ్ కుమార్ (Akshay Kumar), సైఫ్ అలీఖాన్ (Saif Ali Khan) ప్రధాన పాత్రల్లో.. దర్శకుడు ప్రియదర్శన్ రూపొందిస్తోన్న చిత్రం ‘హైవాన్’ (Haiwaan). సరికొత్త థ్రిల్లర్ గా రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్, తెస్పియన్ ఫిలింస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ ప్రెస్టీజియస్ మూవీలో.. ఫస్ట్ టైమ్ అక్షయ్ కుమార్ నెగిటివ్ పాత్రలో నటిస్తున్నారు. సెప్టెంబర్ 11న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోన్న ఈ మూవీ నుంచి తాజాగా మేకర్స్ ఫస్ట్ లుక్ పోస్టర్ (Haiwaan First Look Poster) రిలీజ్ చేశారు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


ఈ పోస్టర్‌లో అక్షయ్ కుమార్, సైఫ్ అలీఖాన్ క్యారెక్టర్స్ ఇంటెన్స్ లుక్స్‌తో ఆకట్టుకుంటున్నాయి. ప్రియదర్శన్ శైలిలో సాగే ఒక యూనిక్ థ్రిల్లర్ చిత్రంగా ‘హైవాన్’ రూపొందుతున్నట్లుగా ఈ ఫస్ట్ లుక్ తెలియజేస్తోంది. ఈ చిత్రంతో డైరెక్టర్ ప్రియదర్శన్ ప్రేక్షకుల్ని ఒక డార్క్, థ్రిల్లింగ్ వరల్డ్‌‌లోకి తీసుకెళ్లనున్నారు. ఈ ఏడాది ప్రేక్షకులు ఎదురుచూస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీస్‌లో ఈ సినిమా కూడా ఒకటి. ఫస్ట్ లుక్ అనంతరం వెంటనే టీజర్ విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇకపై వరస అప్డేట్స్ ఈ మూవీ నుంచి రానున్నాయని మేకర్స్ తెలిపారు.


ఈ చిత్రంలోకి ఇతర కీలక పాత్రల్లో బొమన్ ఇరానీ, సయామీ ఖేర్, శ్రియ పిల్గాంకర్ నటిస్తున్నారు. హైవాన్ మూవీతో అక్షయ్ కుమార్, సైఫ్ అలీఖాన్ దాదాపు 17 ఏళ్ల తర్వాత కలిసి నటిస్తుండటం విశేషం. హైవాన్ చిత్రాన్ని టాప్ ప్రొడక్షన్ విలువలతో నిర్మాతలు వెంకట్ కె నారాయణ, శైలజా దేశాయ్ ఫెన్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా కచ్చితంగా ఓ వైవిధ్యభరిత చిత్రంగా ప్రేక్షకులను అలరిస్తుందని, మంచి సక్సెస్ అవుతుందని మేకర్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

సీఎం విజయ్ పాలనపై వరలక్ష్మి శరత్‌కుమార్ షాకింగ్ పోస్ట్..

నితిన్ ‘హ్యాట్రిక్’ సినిమాలు.. ఈసారైనా హిట్ దక్కేనా

‘వారణాసి’.. జక్కన్నకు కొత్త టెన్షన్!

Updated Date - Jul 16 , 2026 | 08:17 PM