సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Sunita Ahuja: గోవిందా అఫైర్లపై సంచలన వ్యాఖ్యలు

ABN, Publish Date - Jul 07 , 2026 | 04:45 PM

భర్త పరువును తీస్తోందో లేక తన నిజాయితీని ప్రపంచానికి చాటాలని అనుకుంటుందో తెలియదు గానీ బాలీవుడ్ యాక్టర్ భార్య స్టేట్‌మెంట్‌ సంచలనంగా మారుతోంది.

భర్త పరువును తీస్తోందో లేక తన నిజాయితీని ప్రపంచానికి చాటాలని అనుకుంటుందో తెలియదు గానీ బాలీవుడ్ యాక్టర్ భార్య స్టేట్‌మెంట్‌ సంచలనంగా మారుతోంది. ఎవరూ ఊహించని కామెంట్లు చేస్తోంది. అసలు ఆమె చెప్పే విషయాలు వింటున్న వారికి ఎలా స్పందించాలో కూడా తెలియడం లేదట!

సీనియర్ హిందీ నటుడు గోవిందా భార్య సునీత అహుజా మరోసారి కాంట్రావర్సీ స్టేట్ మెంట్స్ తో వార్తల్లో నిలిచింది. గతంలో భర్త గోవిందాపై పలు ఆరోపణలు చేసిన సునీత, తాజాగా ఇతర హీరోయిన్లతో ఆయనకు సంబంధాలున్నాయంటూ బాంబ్ పేల్చింది. ఆమె చేసి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీస్తున్నాయి.

తాజాగా నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారమవుతున్న‘లాకప్ సచ్ యా సజా' రియాలిటీ షోలో పాల్గొన్న సునీత ఈ కామెంట్స్ చేసింది. ఈ షోకు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన ఓ కంటెస్టెంట్, గోవిందాపై గతంలో చేసిన ఆరోపణల గురించి సునీతను ప్రశ్నించాడు. దీనిపై స్పందించిన సునీత, ఎవరైనా తన జీవితం గురించి మాట్లాడే ముందు తన పరిస్థితిని అర్థం చేసుకోవాలని కోరింది. గోవిందా తన భర్త అని, ఆయన ఎలాంటి వారైనా తన ప్రేమలో మార్పు ఉండదని సునీత స్పష్టం చేసింది. ఆయనకు 10 కాదు 50 వివాహేతర సంబంధాలున్నా సరే, చివరి శ్వాస వరకూ ఆయన్ని విడిచిపెట్టే ప్రసక్తే లేదని కూడా చెప్పింది. సునీత చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Updated Date - Jul 07 , 2026 | 04:49 PM