సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

'ధురంధర్‌' మేకింగ్‌పై డాక్యుమెంటరీ!

ABN, Publish Date - Mar 31 , 2026 | 02:44 PM

'ధురంధర్‌' సీరిస్‌ సూపర్‌ హిట్‌ అయిన నేపథ్యంలో మేకింగ్‌ డాక్యుమెంటరీ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. పాకిస్థాన్‌ లోని ప్రధాన నగరాలను 'ధురంధర్‌'లో కళ్ళకు కట్టినట్టు చూపించిన విషయం తెలిసిందే. ఆ సెట్స్ నిర్మాణం వెనుక ఉన్న ఆసక్తికరమైన సంగతులను ఆదిత్య ధర్‌ చెబితే బాగుంటుందని కోరుకుంటున్నారు.

Dhurandhar The Revenge

ఇండియా సినిమా స్కేల్‌ను అమాంతంగా పెంచేసిన సినిమా 'ధురంధర్‌'. దాని వెనుకే వచ్చిన 'ధురంధర్‌ : ది రివేంజ్' కూడా ఏ మాత్రం తగ్గకుండా ముందు సినిమాకు మించిన వసూళ్ళను రాబడుతూ బాక్సాఫీస్‌ బరిలో దూసుకుపోతోంది. కొందరు పనిగట్టుకుని ఈ సినిమాను ప్రోపగాండ మూవీ అని విమర్శించినా... సాధారణ సినిమా ప్రేమికుడు మాత్రం 'ధురంధర్‌' సీరిస్‌ కు పట్టం కట్టేశాడు. దాంతో కొత్తగా చిత్రసీమలోకి అడుగుపెట్టిన వారు సైతం 'ధురంధర్‌' మేకింగ్‌పై డాక్యుమెంటరీ వస్తే బాగుంటుందని అంటున్నారు. ఎందుకంటే... 'ధురంధర్‌' సినిమాలో పాకిస్థాన్‌లోని ల్యారీ పట్టణం సెట్ ను థాయ్‌లాండ్‌లోని ఆరు ఎకరాల స్థలంలో వేశారు. అలానే సంజయ్‌ దత్‌ మీద కొన్ని సన్నివేశాలను గ్రీన్ మ్యాట్ పై చిత్రీకరించి, ఎడారి ప్రాంతంలో వాటిని తెరకెక్కించినట్టు సినిమాలో చూపించారు. అలా వాస్తవ ప్రదేశాలకు భిన్నమైన చోట ఈ సినిమాను చిత్రీకరించి, పాకిస్థాన్‌లోనే షూటింగ్ జరిగిందనే భ్రమను ఆదిత్య ధర్‌ కలిగించాడు. ఈ విషయంలో అతనితో పాటు సినిమాటోగ్రాఫర్‌, వి.ఎఫ్‌.ఎక్స్. నిపుణుల భాగస్వామ్యం కూడా ఉంది.


ఇవాళ బిహైండ్ ద సీన్స్ వీడియోస్‌కు విశేషమైన ఆదరణ లభిస్తున్న నేపథ్యంలో 'ధురంధర్‌' సినిమా రెండు భాగాల మేకింగ్ ను డాక్యుమెంటరీగా విడుదల చేస్తే బాగుంటుందని అందరూ అనుకుంటున్నారు.

విశేషం ఏమంటే... ఈ రకంగా రూపుదిద్దుకున్న స్పెషల్ డాక్యుమెంటరీస్ ద్వారా కొన్ని ఓటీటీ సంస్థలు బాగానే ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నాయి. స్టార్ డైరెక్టర్ రాజమౌళి మీద కూడా 'బాహుబలి, ట్రిపుల్‌ ఆర్' సినిమాల మేకింగ్‌పై ఓ స్పెషల్ డాక్యుమెంటరీని తీసుకొచ్చింది నెట్ ఫ్లిక్స్ సంస్థ. అదే మాదిరిగా ఆదిత్య ధర్‌ మేకింగ్‌ స్టైల్‌ మీద లేదా ధురంధర్‌ సినిమాల మేకింగ్‌ మీద ఓ డాక్యుమెంటరీని తీస్తే... విపరీతమైన వ్యూవర్ షిప్‌ లభిస్తుందన్ని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మరి ఏదైనా ఓటీటీ సంస్థ ఈ దిశగా ప్రయత్నాలు చేస్తుందేమో చూడాలి.

Updated Date - Mar 31 , 2026 | 03:06 PM