అనంతలోకాలకు.. మధుర గాయని
ABN , Publish Date - Apr 12 , 2026 | 01:44 PM
సుప్రసిద్ధ గాయని, భారతరత్న లతా మంగేస్కర్ సోదరి ఆశా భోంస్లే (92) (Asha Bhosle) తుది శ్వాస విడిచారు.
సుప్రసిద్ధ గాయని, భారతరత్న లతా మంగేష్కర్ సోదరి ఆశా భోంస్లే (92) (Asha Bhosle) తుది శ్వాస విడిచారు. గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న ఆమెను కుటుంబ సభ్యులు శనివారం సాయంత్రం ముంబైలోని బ్రీచ్‌కాండీ ఆస్పత్రిలో చేర్పించగా, చికిత్స పొందుతూ ఆదివారం మధ్యాహ్నం కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆమె కుమారుడు ఆనంద్ భోంస్లే ధ్రువీకరించారు. తన తల్లి అంత్యక్రియలను సోమవారం ముంబైలోని శివాజీ పార్క్‌లో నిర్వహిస్తామని తెలిపారు.
తెలుగులో చందమామ (Chandamama) సినిమాలో ‘నాలో ఊహలకు నాలో ఊసులకు అడుగులు నేర్పావూ .. నాలో ఆశలకు నాలో కాంతులకు నడకలు నేర్పావూ’ అంటూ సాగే పాట తెలుగు నాట చాలా ప్రాముఖ్యతను సంపాదించుకుంది. ఇవే కాకుండా మరో నాలుగైదు తెలుగు పాటలు సైతం ఆమె ఆలపించారు. ఆమె మరణ వార్త తెలిసి, అంతా దిగ్భ్రాంతికి లోనవుతున్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ, నివాళులు అర్పిస్తున్నారు.