Emraan Hashmi: ఇమ్రాన్ హష్మీకి స్వైన్ ఫ్లూ.. కీలక కార్యక్రమానికి దూరం!
ABN, Publish Date - Aug 29 , 2026 | 09:01 PM
బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ (Emraan Hashmi)అనారోగ్యానికి గురయ్యారు. ఆయన స్వైన్ ఫ్లూతో బాధపడుతున్నట్లు వైద్యులు నిర్ధారించినట్టు సమాచారం.
బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ (Emraan Hashmi)అనారోగ్యానికి గురయ్యారు. ఆయన స్వైన్ ఫ్లూతో బాధపడుతున్నట్లు వైద్యులు నిర్ధారించినట్టు సమాచారం. గత కొన్ని రోజులుగా ఇమ్రాన్ అనారోగ్యంతో ఉన్నారని, ముంబయికి తిరిగి వచ్చిన అనంతరం వైద్య పరీక్షలు చేయించుకోగా స్వైన్ ఫ్లూ ఉన్నట్లు తేలినట్టు బాలీవుడ్ మీడియా చెబుతోంది. ప్రస్తుతం వైద్యుల సూచన మేరకు ఇమ్రాన్ విశ్రాంతి తీసుకుంటున్నట్లు సమాచారం. అయితే తన ఆరోగ్య పరిస్థితిపై ఆయన ఇప్పటివరకు స్పందించలేదు. బెంగళూరులో జరగాల్సిన ఓ కార్యక్రమానికి హాజరు కాలేకపోతున్నందుకు మాత్రం సోషల్ మీడియా ద్వారా అభిమానులకు క్షమాపణలు చెప్పారు. దీంతో అనారోగ్యం కారణంగానే ఆయన ఈ కార్యక్రమానికి దూరమైనట్లు తెలుస్తోంది.
ఇమ్రాన్ హష్మీ నటించిన తాజా చిత్రం ‘ఆవారాపన్ 2’ ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించింది. ‘ఆవారాపన్’ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు నితిన్ కక్కర్ దర్శకత్వం వహించారు. విశేష్ భట్ నిర్మించారు. ఇమ్రాన్ హష్మీతో పాటు దిశా పటానీ, షబానా అజ్మీ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.