Yellamma: ఎల్లమ్మ.. దేవిశ్రీ ప్రసాద్ లుక్ అదిరిందమ్మా

ABN , Publish Date - Jan 15 , 2026 | 05:17 PM

ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈరోజే ఎదురయ్యింది.. ప్రస్తుతం ఎల్లమ్మ (Yellamma) అప్డేట్ చూసిన ప్రతి ఒక్కరు కూడా ఇదే పాటను పాడుకుంటూ ఉంటారు.

Yellamma

Yellamma: ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈరోజే ఎదురయ్యింది.. ప్రస్తుతం ఎల్లమ్మ (Yellamma) అప్డేట్ చూసిన ప్రతి ఒక్కరు కూడా ఇదే పాటను పాడుకుంటూ ఉంటారు. బలగం సినిమా తరువాత వేణు (Venu Yeldandi) ఎప్పుడెప్పుడు రెండో సినిమాను మొదలుపెడతాడా అని అభిమానులు ఎంతగానో ఎదురుచూసారు. ఎల్లమ్మ అని టైటిల్ తెలిసినా కూడా హీరో ఎవరు అనేది మిస్టరీగా మారింది. దిల్ రాజు బ్యానర్ లో ఎల్లమ్మను చేయడానికి నాని నుంచి నితిన్ వరకు చాలామంది పేర్లు వినిపించి చివరకు ఆ లక్కీ ఛాన్స్ ని మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) కొట్టేశాడు.

నేడు సంక్రాంతి కానుకగా ఎల్లమ్మ గ్లింప్స్ ని మేకర్స్ రిలీజ్ చేసి దేవిశ్రీ ప్రసాద్ లుక్ ని రివీల్ చేశారు. గ్లింప్స్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. బలగం సినిమాలనే ఈ సినిమా కూడా విలేజ్ బ్యాక్ డ్రాప్ లో నడుస్తుందని గ్లింప్స్ ని బట్టి తెలుస్తోంది. ఈ సినిమాలో దేవిశ్రీ.. పర్షి అనే పాత్రలో నటిస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. ఒక మేకను చూపిస్తూ.. గజ్జెలు కట్టుకున్న కాళ్లు పరిగెడుతున్నట్లు చూపించారు. ఇంకోపక్క షూస్ వేసుకున్న కాళ్లు పరిగెడుతున్నట్లు చూపించారు. చివరగా ఒక గట్టున దేవిశ్రీ.. డప్పును తగిలించుకొని సీరియస్ గా కూర్చున్నట్లు చూపించారు.

ఇక దేవిశ్రీ ప్రసాద్ లుక్ చాలా బావుంది. సీరియస్ లుక్ లో కనిపించి మెప్పించాడు. ఇందులో డప్పు కళాకారుడుగా దేవి కనిపించనున్నాడు. ఆ ఊరికి.. దేవికి ఉన్న సంబంధం ఏంటి..? ఆ షూస్ వేసుకొని పరిగెడుతున్న వ్యక్తి.. గజ్జెలు కట్టుకొని పరిగెడుతున్న వ్యక్తి ఇద్దరూ ఒకరేనా.. ? అనేది తెలియాలంటే సినిమా వచ్చేవరకు ఆగాలి. మ్యూజిక్ కి సంబంధించిన కథ అని తెలుస్తోంది. దానికి దేవి పర్ఫెక్ట్ ఛాయిస్ అని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం ఈ గ్లింప్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి ఈ సినిమాతో దేవి - వేణు హిట్ ను అందుకుంటారేమో చూడాలి.

Updated Date - Jan 15 , 2026 | 05:57 PM