దృశ్యం3.. అక్షయ్ ఖన్నా తీరుపై దర్శకుడి ఆగ్రహం
ABN, Publish Date - Sep 27 , 2026 | 10:28 AM
బాలీవుడ్ నటుడు అక్షయ్ ఖన్నా తీరుపై ‘దృశ్యం 3’ దర్శకుడు అభిషేక్ పాఠక్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
బాలీవుడ్ నటుడు అక్షయ్ ఖన్నా (Akshaye Khannar) తీరుపై ‘దృశ్యం 3’ ( Drishyam 3: The Conclusion) దర్శకుడు అభిషేక్ పాఠక్ (Abhishek Pathak) ఆగ్రహం వ్యక్తం చేశారు. షూటింగ్ ప్రారంభానికి కేవలం వారం రోజుల ముందు ప్రాజెక్టు నుంచి అక్షయ్ ఖన్నా తప్పుకోవడంపై ఆయన తాజాగా స్పందించారు.
‘ఒక నటుడు ఒప్పందంపై సంతకం చేసి, పారితోషికం అందుకున్న తర్వాత అర్థాంతరంగా సినిమా నుంచి తప్పుకోవడం సరైన పద్ధతి కాదు. సినిమానే నమ్ముకున్న ఎంతో మంది జీవనోపాధిపై ప్రభావం పడుతుంది. నిర్మాతలు నష్టపోతారు. ఏవైనా అభ్యంతరాలుంటే ముందే చర్చించి పరిష్కరించుకోవాలి’ అని అన్నారు. కాగా, ఇదే విషయమై ‘దృశ్యం 3’ నిర్మాత ఇప్పటికే అక్షయ్ ఖన్నాకు లీగల్ నోటీసులు పంపారు.