Drishyam 3: అజయ్ దేవ్ గన్ సినిమాల్లో సరికొత్త రికార్డ్!
ABN , Publish Date - Oct 03 , 2026 | 01:54 PM
అజయ్ దేవ్‌గన్, శ్రియా, టబు కీలక పాత్రలు పోషించిన 'దృశ్యం 3' చిత్రానికి భారీ ఓపెనింగ్స్ లభించాయి. ఈ యేడాది 'ధురంధర్ 2' తర్వాత ఫస్ట్ డే కలెక్షన్స్ లో ఈ సినిమా రెండో స్థానంలో నిలిచింది.
మోహన్ లాల్ నటించిన మలయాళ చిత్రం 'దృశ్యం' ఘన విజయం సాధించింది. దాంతో ఆ సినిమాను వివిధ భాషల్లో రీమేక్ చేశారు. ఆ తర్వాత వచ్చిన సీక్వెల్ కూడా పలు భాషల్లో పునర్ నిర్మితమైంది. అయితే 'దృశ్యం, దృశ్యం 2' రెండు సినిమాల రీమేక్స్ కూడా మాతృక దర్శకుడు జీతూ జోసఫ్ ఇచ్చిన కథతోనే వచ్చాయి. కానీ 'దృశ్యం 3' సినిమా తెలుగులో రీమేక్ కాలేదు. మలయాళ చిత్రమే తెలుగులో డబ్ అయ్యింది.
హిందీకి వచ్చే సరికీ మాతృకతో సంబంధం లేకుండా, 'దృశ్యం 2'ను హిందీలో తెరకెక్కించిన అభిషేక్ పాఠక్ 'దృశ్యం 3'కి కథను అందించి, తానే దర్శకత్వం వహించాడు. అజయ్ దేవ్ గన్ హీరోగా నటించిన ఈ సినిమా అక్టోబర్ 2న వరల్డ్ వైడ్ రిలీజ్ అయ్యింది.
విశేషం ఏమంటే... ఇటీవలి కాలంలో అజయ్ దేవ్ గన్ చిత్రాలకు రాని ఓపెనింగ్స్ 'దృశ్యం 3'కి వచ్చాయి. ఈ సినిమా మొదటి రోజును ఏకంగా రూ. 95 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. 2015లో వచ్చిన హిందీ 'దృశ్యం' మొదటి రోజున రూ. 5.85 కోట్లను వసూలు చేసింది. మొత్తంగా రూ. 110 కోట్ల గ్రాస్ ను సంపాదించింది. ఇక 2022లో వచ్చిన 'దృశ్యం 2' సినిమా మొదటి రోజున 15.38 కోట్ల గ్రాస్ ను, టోటల్ రన్‌లో రూ. 342 కోట్ల గ్రాస్‌ను అందుకుంది. అయితే 'దృశ్యం 3' విషయానికి వచ్చే సరికీ ఈ మూవీ మొదటి రోజునే 95 కోట్ల గ్రాస్ ను వసూలు చేయడం విశేషమని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
అజయ్ దేవ్ గన్ సినిమాల ఓపెనింగ్ డే రికార్డులను 'దృశ్యం 3' మూవీ తిరగరాసింది. ఇప్పటి వరకూ అజయ్ దేవ్ గన్ సినిమాల్లో అత్యధికంగా ఫస్ట్ డే కలెక్షన్స్ అందుకున్న సినిమా 'సింగమ్ అగైన్'. ఈ సినిమాకు మొదటి రోజున 43. 5 కోట్ల గ్రాస్ వచ్చింది. అలానే 'సింగం రిటర్న్స్' రూ. 32.1 కోట్లు, గోల్ మాల్ అగైన్ రూ. 30.15 కోట్లు, 'రైడ్ 2' రూ. 19.25 కోట్లు తొలి రోజున వసులు చేశాయి. ఈ రికార్డులను 'దృశ్యం 3' చెరిపేసింది. అలానే ఈ యేడాది విడుదలైన సినిమాల ఓపెనింగ్ డే కలెక్షన్స్ విషయంలో 'దురంధర్ 2' రూ. 226.6 కోట్లు సాధించి, ఫస్ట్ ప్లేస్‌లో నిలవగా, ఆ తర్వాత స్థానంలో 'దృశ్యం 3' చేరింది. మలయాళంలో వచ్చిన 'దృశ్యం 3' కంటే హిందీ వర్షన్ బాగుందని, పైగా ఈ సీరిస్ కు ఈ పార్ట్ తో సరైన ముగింపు పలికారని ప్రేక్షకులు కితాబిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
‘టాక్సిక్’ ఓటీటీ రిలీజ్ మరింత ఆలస్యం.. అక్టోబర్‌లోనూ డౌటే!
స్మిత్ మచ్చార్ సాహసం ప్రతి భారతీయుడికీ గర్వకారణం: చిరంజీవి
పబ్లిగ్గా బుగ్గగిల్లిన ఆకతాయి.. షాకైన హీరోయిన్.. వీడియో వైరల్