సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

‘దృశ్యం 3 రికార్డు’.. ‘ధురంధర్ 2’ తర్వాత ఈ చిత్రమే.. ‘పెద్ది’, ‘టాక్సిక్’ అవుట్

ABN, Publish Date - Oct 12 , 2026 | 07:40 PM

బాక్సాఫీస్ వద్ద సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్లకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన ‘దృశ్యం’ ఫ్రాంచైజీ మరోసారి తన తిరుగులేని ఆధిపత్యాన్ని చాటుకుంది. కలెక్షన్ల పరంగా ఈ ఏడాది దృశ్యం 3 సెకండ్ ప్లేస్‌కు చేరుకుంది.

Drishyam 3 Still

బాక్సాఫీస్ వద్ద సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్లకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన ‘దృశ్యం’ ఫ్రాంచైజీ మరోసారి తన తిరుగులేని ఆధిపత్యాన్ని చాటుకుంది. బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్, శ్రియా శరణ్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు అభిషేక్ పాఠక్ తెరకెక్కించిన ‘దృశ్యం 3 : ది కన్‌క్లూజన్’ (Drishyam The Conclusion) థియేటర్లలో కాసుల వర్షం కురిపిస్తోంది. ఈ నెల 2న గాంధీ జయంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం, బాక్సాఫీస్ వద్ద అంచనాలకు మించి దూసుకుపోతూ కేవలం పది రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ. 480 కోట్ల భారీ గ్రాస్ కలెక్షన్స్‌ను రాబట్టి రికార్డు సృష్టించింది. ఈ దెబ్బతో 2026 ఏడాదికి గాను ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రాల జాబితాలో ‘దృశ్యం 3’ రెండో స్థానానికి చేరుకుంది.


‘ధురంధర్ 2’ తర్వాత టాప్ ప్లేస్ దృశ్యానిదే!

ఈ ఏడాది బాక్సాఫీస్‌ను షేక్ చేస్తూ వచ్చిన సినిమాల్లో రణ్‌వీర్ సింగ్ నటించిన ‘ధురంధర్ : ది రివెంజ్’ ఏకంగా రూ. 1,813 కోట్ల కలెక్షన్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆ తర్వాత అత్యధిక వసూళ్లు రాబట్టిన రెండో చిత్రంగా ‘దృశ్యం 3’ (రూ. 480 కోట్లు) నిలిచింది. దీంతో ఇప్పటివరకు టాప్‌లో ఉన్న ‘బార్డర్ 2’ (రూ. 450 కోట్లు), ‘హనుమాన్ అంశ్’ (రూ. 435 కోట్లు) చిత్రాలను వెనక్కి నెట్టి రెండో స్థానాన్ని కైవసం చేసుకుంది. మరోవైపు భారీ హైప్‌తో వచ్చిన రాకింగ్ స్టార్ యశ్ చిత్రం ‘టాక్సిక్’ (రూ. 342 కోట్లు), రామ్ చరణ్ ‘పెద్ది’ (రూ. 341 కోట్లు) చిత్రాల లైఫ్‌టైమ్ వసూళ్లను కూడా దృశ్యం 3 కేవలం పది రోజుల్లోనే దాటేసి బాక్సాఫీస్ వద్ద తన సత్తా ఏంటో నిరూపించింది.


2026 టాప్ 10 వరల్డ్‌వైడ్ కలెక్షన్ల జాబితా:

ధురంధర్ : ది రివెంజ్ - రూ. 1,813 కోట్లు

దృశ్యం 3 : ది కన్‌క్లూజన్ - రూ. 480 కోట్లు

బార్డర్ 2 - రూ. 450 కోట్లు

హనుమాన్ అంశ్ - రూ. 435 కోట్లు

టాక్సిక్ - రూ. 342 కోట్లు

పెద్ది - రూ. 341 కోట్లు

మీర్జాపూర్ : ది మూవీ - రూ. 339 కోట్లు

బెత్లెహెం కుటుంబ యూనిట్ - రూ. 330 కోట్లు

జననాయగన్ - రూ. 324 కోట్లు

కరుప్పు - రూ. 310 కోట్లు

కంటెంట్ బలంగా ఉండి, స్క్రీన్‌ప్లే గ్రిప్పింగ్‌గా ఉంటే ఆడియన్స్ బ్రహ్మరథం పడతారని ‘దృశ్యం 3’ మరోసారి రుజువు చేసింది. ఫుల్ రన్‌లో ఈ చిత్రం రూ. 500 కోట్ల క్లబ్‌ను కూడా సునాయాసంగా దాటేసే అవకాశాలున్నాయని ట్రేడ్ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి.

ఇవి కూడా చదవండి:

బన్నీ-లోకేష్ సినిమా ఆగిపోయిందా? అసలు నిజం ఇదే

ఊటీలో ‘జనవరి 12 విడుదల’ టీమ్.. సంక్రాంతికి బాక్సాఫీస్ బద్దలే

‘వారణాసి’లో రామాయణ ఘట్టంపై జక్కన్న సంచలన వ్యాఖ్యలు

Updated Date - Oct 12 , 2026 | 07:40 PM