Anurag Kashyap: ఎప్ స్టీన్ ఫైల్స్ లో తన పేరు.. స్పందించిన డైరెక్టర్
ABN, Publish Date - Feb 06 , 2026 | 12:53 PM
ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోన్నవార్తల్లో ఎప్ స్టీన్ ఫైల్స్ (Epstein Files) ఒకటి.
Anurag Kashyap: ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోన్నవార్తల్లో ఎప్ స్టీన్ ఫైల్స్ (Epstein Files) ఒకటి. ఎప్ స్టీన్ అనే ఒక బిజినెస్ మ్యాన్.. చిన్న పిల్లలైన అమ్మాయిలను కిడ్నాప్ చేసి.. వారితో అత్యాచారం చేయించేవాడని, ఈ స్కాండల్ లో పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు, నేతలు కూడా ఉన్నారని వెల్లడి కావడం సంచలనం సృష్టిస్తోంది. వారిలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, ప్రఖ్యాత శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్, లెజెండరీ బిజినెస్‌మ్యాన్ బిల్ గేట్స్ కూడా ఉన్నారని, ఆ పార్టీలలో వీరు పాల్గొన్న ఫోటోలు కూడా బయటకు రావడం సంచలనంగా మారింది.
కేవలం అత్యాచారమే కాకుండా ఎప్ స్టీన్ చిన్న పిల్లల మాంసాన్ని కూడా పార్టీలలో సర్వ్ చేయించేవాడని కూడా ఆరోపణలు వచ్చాయి. ఎప్ స్టీన్ ఫైల్స్ అనే పేరుతో ఆ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోన్నాయి. తాజాగా ఎప్ స్టీన్ ఫైల్స్ లో బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ పేరు కూడా బయటపడింది. బీజింగ్ లో ఎప్ స్టీన్ ఇచ్చిన పార్టీకి అనురాగ్ కూడా వెళ్లినట్లు వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ స్పందించారు. ఇలాంటి వార్తలతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.
'ఒక స్పీకర్ గా నాకు రోజుకు 1 నుంచి 15 ఆహ్వానాలు అందుతాయి. వాటన్నింటికీ నేను స్పందించను. ఎప్పుడో ఒకసారి వాటికి రెస్పాండ్ అవుతాను. ఇప్పటివరకు నేను బీజింగ్ చూసింది కూడా లేదు' అని తెలిపారు. దీంతో ఈ రూమర్స్ కి అనురాగ్ కశ్యప్ చెక్ పెట్టినట్టే. ప్రస్తుతం అనురాగ్ కశ్యప్ తెలుగులో డెకాయిట్ అనే సినిమాలో విలన్ గా కనిపించనున్నారు. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ కి సిద్ధం అవుతోంది.