సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

భార్యకు రూ. 400 కోట్లు భరణం ఇచ్చిన స్టార్ హీరో..

ABN, Publish Date - Jul 03 , 2026 | 09:33 PM

బాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యంత ఖరీదైన సెలబ్రిటీ విడాకులలో స్టార్ హీరో హృతిక్ రోషన్ (Hrithik Roshan), ఆయన మాజీ భార్య సుసానే ఖాన్‌ల బ్రేకప్ ఉదంతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెల్సిందే.

Hrithik Roshan

బాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యంత ఖరీదైన సెలబ్రిటీ విడాకులలో స్టార్ హీరో హృతిక్ రోషన్ (Hrithik Roshan), ఆయన మాజీ భార్య సుసానే ఖాన్‌ల బ్రేకప్ ఉదంతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెల్సిందే. 2014 లో ఈ జంట అధికారికంగా విడిపోయిన సమయంలో, సుసానే ఖాన్ తన భర్త హృతిక్ నుండి ఏకంగా రూ. 400 కోట్ల భారీ మొత్తాన్ని భరణంగా డిమాండ్ చేసి మరీ తీసుకుందంటూ పెద్ద ఎత్తున వార్తలు ప్రచారమయ్యాయి. స్టార్ హీరో కావడంతో హృతిక్ కూడా భరణం చెల్లించాడని కూడా మాట్లాడుకున్నారు. గత కొన్ని ఏళ్లుగా సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతున్న ఈ పుకార్లపై తాజాగా సుసానే ఖాన్ సోదరి, ప్రముఖ జ్యువెలరీ డిజైనర్ ఫరా ఖాన్ అలీ స్పందిస్తూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తన సోదరి ఎలాంటి భరణం అందుకోలేదని చెప్పి షాక్ ఇచ్చింది.


ఒక ఇంటర్వ్యూలో ఫరా ఖాన్ అలీ మాట్లాడుతూ.. 'విడాకుల తర్వాత హృతిక్ తన సోదరికి రూ. 400 కోట్లు ఇచ్చారని, ఆ డబ్బుతో సుసానే రాత్రికి రాత్రే ధనవంతురాలైపోయిందంటూ ఆన్‌లైన్‌లో వస్తున్న కామెంట్లు చూసినప్పుడల్లా నా మనసు ఎంతగానో కలిచివేస్తోంది. ఈ వార్తలు అన్నీ అబద్దం. హృతిక్ నుంచి సుసానే ఏమి తీసుకోలేదు.మా తల్లిదండ్రులు మమ్మల్ని విలువలతో పెంచారు. డబ్బుతోనో.. లేక సుఖాలతో పెరగాలని నేర్పించలేదు. సుసానే.. ఎప్పుడు విలువలతోనే బ్రతుకుతుంది. ఎవరి దగ్గర నుంచి రూపాయి ఆశించదు. ఆమె గోల్డ్ డిగ్గర్ కాదు. మేము ఎంతో ప్రతిష్టాత్మకమైన, గౌరవప్రదమైన ఒక ఖాందానీ కుటుంబం నుంచి వచ్చాం. మాకు ఒక విలువ ఉంటుంది.


సుసానేకి నేను చాలా సార్లు చెప్పాను. ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టు అని.. కానీ, ఆమె మనం ఇప్పుడు మాట్లాడి.. అది నిజం కాదు అని చెప్పడం వలన ఏం జరుగుతుంది. వారు మాట్లాడుకొనే వాటివలన నా జీవితంలో కొత్త మార్పు ఏం జరగదు అని చెప్తుంది. ఇలా ఉండబట్టే ఇంకా హృతిక్ కుటుంబంతో సుసానేకి మంచి బంధం కొనసాగుతోంది' అని తెలిపింది. నిజమే .. హృతిక్.. భార్య సుసానేతో విడిపోయినా వారు మంచి స్నేహితులుగా కొనసాగుతున్నారు. ఇక ఎప్పటి నుంచో వస్తోన్న ఈ భరణం వివాదానికి ఫరా ఖాన్ అలీ ఫుల్ స్టాప్ వేసింది.

Updated Date - Jul 03 , 2026 | 09:41 PM