సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

ధూమ్ 4 లో మహేష్.. ఆశకైనా హద్దుండాలి కదరా

ABN, Publish Date - Oct 24 , 2026 | 08:31 PM

బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిల్మ్స్ (Yash Raj Films) అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే క్రేజీ ఫ్రాంచైజీ ధూమ్ (Dhoom). ఇప్పటికే ఈ ఫ్రాంచైజీ నుంచి 3 సినిమాలు వచ్చాయి.

Mahesh Babu

బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిల్మ్స్ (Yash Raj Films) అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే క్రేజీ ఫ్రాంచైజీ ధూమ్ (Dhoom). ఇప్పటికే ఈ ఫ్రాంచైజీ నుంచి 3 సినిమాలు వచ్చాయి. అందులో రెండు సూపర్ డూపర్ హిట్స్ గా నిలవగా ధూమ్ 3 మాత్రం ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. ఇక ధూమ్ 4 వచ్చే ఏడాది రిలీజ్ కి సిద్ధమవుతోంది. రణబీర్ కపూర్ ఈ సినిమాలో నటిస్తున్నాడు అని వార్తలు వినిపించాయి. ఇక తాజాగా ఈ మూవీకి సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త టాలీవుడ్‌లోనూ, బాలీవుడ్‌లోనూ తెగ చక్కర్లు కొడుతోంది. ఈ హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్‌కు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తుండగా, ఈ చిత్రంలో లీడ్ రోల్ కోసం టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్ బాబును మేకర్స్ సంప్రదించారన్నది వార్త. ఈ విషయం తెలియడంతో మహేష్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేవు.


బాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం ధూమ్ 4 కోసం మహేష్ బాబును కలిసి కథను వినిపించినప్పటికీ.. ఆయన ఈ భారీ ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించినట్లు ప్రచారం జరుగుతోంది. కెరీర్ పరంగా మహేష్ ఎప్పుడూ టాలీవుడ్‌కే అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటారనే విషయం తెలిసిందే. హైదరాబాద్‌ కేంద్రంగానే పనిచేస్తూ, తెలుగు సినిమాల ద్వారానే గ్లోబల్ స్థాయిలో తన మార్క్ చూపించాలనే గట్టి పట్టుదలతో మహేష్ ఉన్నాడు. ఈ విషయాన్ని ఆయన అందరి ముందే బయటపెట్టాడు. ఈ కారణంగానే బాలీవుడ్‌కు వెళ్లి పనిచేయాల్సి వచ్చే ఇలాంటి భారీ పాన్-ఇండియా లేదా హిందీ ఫ్రాంచైజీ ఆఫర్లను మహేష్ సున్నితంగా తిరస్కరిస్తూ వస్తున్నాడు.


ఇక మహేష్ గురించి తెలిసి కూడా ధూమ్ 4 లో నటిస్తున్నాడు అంటే ఎలా నమ్మార్రా.. ఆశకైనా హద్దు ఉండాలిగా అని మరికొంతమంది ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. ఎంత పెద్ద ఆఫర్ అయినా.. ఎంత పెద్ద బ్యానర్ అయినా కూడా మహేష్ బాలీవుడ్ వైపు కన్నెత్తి చూడడని, ఇలాంటి రూమర్స్ వస్తే వెంటనే నమ్మకండి అని కూడా కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే మహేష్ బాబు ఈ ప్రాజెక్ట్‌ను రిజెక్ట్ చేయడంతో యశ్ రాజ్ ఫిల్మ్స్ మేకర్స్ ఇప్పుడు ఇతర ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించినట్లు సమాచారం. మరి ధూమ్ 4 ఏ స్టార్ హీరో చేతికి వెళ్తుందో చూడాలి.

Updated Date - Oct 24 , 2026 | 08:40 PM