సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

రూ. 2 వేల కోట్ల దారిలో 'ధురంధర్‌: ది రివెంజ్‌'!

ABN, Publish Date - Mar 23 , 2026 | 03:17 PM

రణవీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్‌ తెరకెక్కించిన 'ధురంధర్‌: ది రివెంజ్‌' నాలుగు రోజుల్లో 750 కోట్లకు పైగా గ్రాస్‌ను వసూలు చేసింది. అతి త్వరలోనే ఈ సినిమా 'పుష్ప 2' రికార్డులను అధిగమిస్తుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

Dhurandhar 2 Movie

రణవీర్ సింగ్‌ (Ranveer Singh) హీరోగా ఆదిత్య ధర్‌ (Aditya Dhar) తెరకెక్కించిన 'ధురంధర్‌: ది రివెంజ్‌' (Dhurandhar : The revenge) మూవీ ఫస్ట్ వీకెండ్‌కు భారీ కలెక్షన్స్‌ను సాధించింది. గురువారం ఈ సినిమా థియేటర్లలో విడుదల కాగా బుధవారం రాత్రి నుండి వరల్డ్ వైడ్‌ ప్రీమియర్ షోస్‌ ప్రదర్శించారు. దాంతో ఆదివారం రాత్రికి ఈ సినిమా రూ. 761 కోట్ల గ్రాస్‌ను వసూలు చేసింది. అయితే దీనికి ముందు వచ్చిన 'పుష్ప -2' (Pushpa 2) ను 'ధురంధర్‌ 2' సినిమా క్రాస్ చేయలేకపోయింది. అయితే ఇందులో ఓ చిన్నపాటి తేడా ఉంది. గత సంవత్సరం డిసెంబర్‌లో వచ్చిన 'ధురంధర్‌' సినిమాను, తాజాగా విడుదలైన దాని సీక్వెల్‌ను కూడా కంటెంట్ కారణంగా అరబ్‌ దేశాలలో ప్రదర్శించలేదు. ఆ రకంగా చూసినప్పుడు 'పుష్ప 2' సినిమా కంటే 'ధురంధర్‌ 2' విదేశాలలో భారీ మొత్తాన్నే వసూలు చేసినట్టు.


నిర్మాతలు చెబుతున్న దాని ప్రకారం 'ధురంధర్ -2' మొదటి నాలుగు రోజుల్లో భారత్‌లో రూ. 550 కోట్ల గ్రాస్‌ను వసూలు చేయగా, విదేశాలలో రూ. 211 కోట్ల గ్రాస్‌ను వసూలు చేసింది. ఓ హిందీ సినిమా తొలి నాలుగు రోజుల్లో, అదీ గల్ఫ్ దేశాలు మినహాయించి ఇంత మొత్తం వసూలు చేయడం గొప్ప విషయమని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అలానే 'పుష్ప 2' రికార్డులను సోమవారం నాటికే 'ధురంధర్‌ 2' అధిగమించవచ్చని కూడా అంటున్నారు. ఎందుకంటే... 'ధురంధర్‌ 2' సినిమా కలెక్షన్స్ రోజు రోజుకూ పెరుగుతున్నాయి తప్పితే తగ్గడం లేదు.


'ధురంధర్‌ -2' సినిమా మొదటి రోజున (బుధవారం నాటి ప్రీమియర్ షోస్‌ కలిపి) రూ. 145 కోట్లు, రెండో రోజు రూ 83 కోట్లు, మూడో రోజు రూ. 117 కోట్లు, నాలుగో రోజు రూ. 121 కోట్లు వసూలు చేసింది. ఇండియాలోనే ఈ సినిమా ఈ నాలుగు రోజుల్లో రూ. 466 కోట్ల నెట్‌ను వసూలు చేసిందని మేకర్స్ తెలిపారు. 'పుష్ప2' సినిమా పది రోజుల్లో వెయ్యి కోట్ల క్లబ్‌లో చేరగా, 'ధురంధర్‌ 2' తొమ్మిది రోజుల్లోనే రూ. 1000 కోట్ల గ్రాస్‌ వసూలు చేసే ఆస్కారం ఉంది. అలానే ఈ సినిమా రెండు వేల కోట్ల మైలురాయిని కూడా దాటేస్తుందని ట్రేడ్ పండిట్స్ అంచనా వేస్తున్నారు.

Updated Date - Mar 23 , 2026 | 03:17 PM