సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Dhurandhar: ఈసారి పాన్ ఇండియా రిలీజ్...

ABN, Publish Date - Feb 03 , 2026 | 11:06 AM

మార్చి 19న ఏకంగా ఐదు భారతీయ భాషల్లో 'ధురంధర్: ది రివేంజ్' మూవీ విడుదల కాబోతోంది. ప్రథమ భాగానికి లభించిన ఆదరణను దృష్టిలో పెట్టుకుని మేకర్స్ ఇప్పుడీ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయబోతున్నారు.

Dhurandhar Pan India Release

గత యేడాది హిందీ చిత్రసీమకు కొత్త ఊపిరిని అందించిన సినిమాలు చేతి వేళ్ల మీద లెక్కించదగ్గవే. అందులో ఫిబ్రవరిలో వచ్చిన 'ఛావా' (Chaava) ఒకటి కాగా... జులైలో వచ్చిన 'సైయారా' మరొకటి. అయితే ఈ రెండు సినిమాలను మించి అఖండ విజయాన్ని అందుకున్న సినిమా 'ధురంధర్' (Dhurandhar). మూడున్నర గంటల నిడివి ఉన్న ఈ సినిమా బాలీవుడ్ రికార్డులను తిరగరాసింది. సింగిల్ లాంగ్వేజ్ లో రిలీజ్ అయ్యి ఏకంగా రూ. 1400 కోట్ల గ్రాస్ ను వరల్డ్ వైడ్ వసూలు చేసింది. ఈ కథను చెప్పడానికి మూడున్నర గంటల సమయం చాలదని గ్రహించిన దర్శకుడు ఆదిత్య ధర్ (Aditya Dhar) దానికి సీక్వెల్ కూడా ఉంటుందని అప్పుడే ప్రకటించాడు. అంతేకాదు... దానిని మార్చి 19న విడుదల చేస్తాననీ చెప్పాడు. తొలి భాగం గ్రాండ్ సక్సెస్ అందుకున్న నేపథ్యంలో ద్వితీయ భాగాన్ని పాన్ ఇండియా స్థాయిలో ఐదు భాషల్లో విడుదల చేయబోతున్నాడు.

ఇదిలా ఉంటే... మార్చి 19న ఇప్పటికే రెండు తెలుగు సినిమాలు విడుదలకు రావాల్సి ఉంది. అందులో ఒకటి కన్నడ అనువాద చిత్రం, యశ్ నటించిన 'టాక్సిక్'. మరొకటి అడివి శేష్ నటించిన 'డకాయిట్'. మరి 'ధురంధర్' కారణంగా ఈ రెండు సినిమాలలో ఏదైనా వాయిదా పడుతుందేమో చూడాలి.

Updated Date - Feb 03 , 2026 | 11:06 AM