సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

500 స్క్రీన్స్‌లో 'ధురంధర్'

ABN, Publish Date - Mar 13 , 2026 | 01:04 PM

'ధురంధర్‌ : ది రివెంజ్‌' మూవీ ఈ నెల 19న విడుదల కాబోతున్న నేపథ్యంలో దానికి వారం ముందే 'ధరంధర్' మూవీని దేశ, విదేశాలలో 500 స్క్రీన్స్ లో ప్రదర్శిస్తున్నారు. ఉత్తర అమెరికాలోనే దాదాపు 185 స్క్రీన్స్‌లో 'ధురంధర్‌' ఇప్పుడు ప్రదర్శితమౌతోంది.

Dhurandhar

రణవీర్ సింగ్ (Ranveer Singh) హీరోగా ఆదిత్య ధర్‌ (Aditya Dhar) రూపొందించిన 'ధురంధర్‌' (Dhurandhar) సినిమా ఒకసారి చూస్తే అంత తేలికగా మనసులోంచి వెళ్ళిపోదు. అయితే ఈ సినిమా విడుదలై మూడు మాసాలు గడిచిన సందర్భంగా ఇప్పుడు మరోసారి దాన్ని విడుదల చేశారు నిర్మాతలు. డిసెంబర్ 5న విడుదలైన 'ధురంధర్‌' మూవీ ఆ యేడాది అత్యధిక కలెక్షన్లను వసూలు చేసిన చిత్రంగా నిలిచింది. ఈ నెల 19న దాని సీక్వెల్ రాబోతోంది. ఈ సందర్భంలో భారత్‌లో మార్చి 12న దాదాపు 250 స్క్రీన్స్‌లో ఈ సినిమాను రీ-రిలీజ్ చేశారు. అలానే శుక్రవారం నుండి విదేశాలలో 250 స్క్రీన్స్‌లో స్క్రీనింగ్ మొదలు పెట్టారు. వచ్చే శుక్రవారం 'ధురంధర్ 2' వస్తున్న సందర్భంగా దాని ప్రీక్వెల్‌ను ఇది వరకూ చూడని వారు చూడటానికి, గతంలో చూసిన వారు మరోసారి చూసేందుకు ఇది ఉపయోగపడుతుందని మేకర్స్ చెబుతున్నారు. భారతదేశంలో పెద్ద సినిమాలు రీ-రిలీజ్ కావడం అనేది సహజమైపోయింది. అయితే హిందీ సినిమాలు అంతర్జాతీయంగా మళ్లీ విడుదల కావడం చాలా అరుదు. ఉత్తర అమెరికాలోనే దాదాపు 185 స్క్రీన్లలో శుక్రవారం నుండి 'ధురంధర్‌'ను ప్రదర్శిస్తున్నారు.


ఇదిలా ఉంటే... ‘ధురంధర్: ది రివెంజ్’ సినిమా ప్రపంచవ్యాప్తంగా మార్చి 19న విడుదల అవుతోంది. అయితే ఒక రోజు ముందుగా అంటే మార్చి 18న అమెరికా, కెనడా అంతటా ప్రత్యేక బుధవారం ప్రీమియర్ షోస్‌ నిర్వహిస్తున్నారు. ఈ ప్రీమియర్ షోస్‌ ఎక్కువగా ప్రీమియం లార్జ్ ఫార్మాట్ (PLF) స్క్రీన్లలో ప్రదర్శించబోతున్నారు. వీటిలో భారీ స్క్రీన్లు, డాల్బీ అట్మోస్‌ వంటి అత్యుత్తమ సౌండ్ సిస్టమ్స్, గ్రేట్ ప్రొజెక్షన్ టెక్నాలజీ, లగ్జరీ సీటింగ్ వంటి అత్యాధునిక సదుపాయాలు ఉంటాయి. సాధారణంగా ఈ రకమైన ఫార్మాట్లు భారీ హాలీవుడ్ ఈవెంట్ సినిమాలకే కేటాయిస్తారు. ఇప్పటికే ఈ మిడ్-వీక్ ప్రీమియర్ షోస్‌ చాలా చోట్ల సోల్డ్ అవుట్ అవుతున్నాయని అక్కడి పంపిణీదారులు తెలిపారు. దీంతో 'ధురంధర్‌' సీక్వెల్‌పై ప్రేక్షకుల్లో ఉన్న భారీ ఆసక్తి, అలాగే సినిమా విడుదల కానున్న స్థాయి స్పష్టంగా కనిపిస్తోంది. జియో స్టూడియోస్ సమర్పణలో, బి62 స్టూడియోస్ నిర్మాణంలో రూపొందుతున్న 'ధురంధర్‌ 2' చిత్రం హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.

Updated Date - Mar 13 , 2026 | 01:04 PM