ధనుష్ మరో బాలీవుడ్ సినిమా.. ఈ సారి ఏకంగా భన్సాలీ బ్యానర్‌లోనే
ABN, Publish Date - Apr 29 , 2026 | 07:33 AM
అద్భుతమైన నటనతో దక్షిణాది ప్రేక్షకులను అలరిస్తూనే, ‘రాంఝానా, అత్రంగీ రే’ చిత్రాలతో బాలీవుడ్‌లోనూ కథానాయకుడిగా తన స్థానాన్ని పదిలం చేసుకున్నారు ధనుష్
అద్భుతమైన నటనతో దక్షిణాది ప్రేక్షకులను అలరిస్తూనే, ‘రాంఝానా, అత్రంగీ రే’ చిత్రాలతో బాలీవుడ్‌లోనూ కథానాయకుడిగా తన స్థానాన్ని పదిలం చేసుకున్నారు ధనుష్ (Dhanush). ఇప్పుడు ఆయన మరో బాలీవుడ్ చిత్రంలో నటించబోతున్నారని టాక్. బాలీవుడ్ భారీ నిర్మాణ సంస్థ దిగ్గజ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ (Sanjay Leela Bhansali)కి చెందిన ‘భన్సాలీ ప్రొడక్షన్స్’ (Bhansali Productions) బ్యానర్‌లో ఓ భారీ బడ్జెట్ చిత్రంలో ధనుష్ నటించనున్నారని ప్రచారం జరుగుతోంది.
రెండు నెలల క్రితం స్క్రిప్ట్ ఫైనల్ అయిన తర్వాత హీరో అన్వేషణ మొదలుపెట్టగా, ముందుగా ఓ ప్రముఖ తెలుగు హీరోతో చర్చలు జరిపినట్లు సమాచారం. అయితే ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఇప్పుడు ధనుష్ చేతికి వచ్చిందని బాలీవుడ్ మీడియా చెబుతోంది. ‘సంజయ్ లీలా భన్సాలీ, ధనుష్‌తో కలసి ప్రతిష్ఠాత్మకమైన కొత్త ప్రాజెక్ట్‌ను ప్లాన్ చేశారు.
దట్టమైన అటవీ నేపథ్యంలో సాగే పౌరాణిక గాథతో తమిళ దర్శకుడు పీ.ఎస్ మిత్రన్ తెరకెక్కించనున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది సెట్స్‌పైకి వెళ్లనుంది’ అనేది ఆ వార్తల సారాంశం. ఇదిలాఉంటే.. ప్రస్తుతం ధనుష్ నటించిన ‘కర’ ( kara) చిత్రం ఈ గురువారం ప్రేక్షకుల ముందుకు రానుండగా చేతిలో డజన్ చిత్రాలతో 2030 వరకు బిజీగా ఉన్నారు.