Dhamaal 4: మళ్లీ మొదలైన ఖజానా వేట.. ‘ధమాల్ 4’ ట్రైలర్ ఎలా ఉందంటే
ABN , Publish Date - Jun 13 , 2026 | 07:16 PM
బాలీవుడ్‌లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ కామెడీ ఫ్రాంచైజీలలో ఒకటైన ‘ధమాల్’ సిరీస్ చిత్రాలలో భాగంగా ‘ధమాల్ 4’ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. జూలై 10న థియేటర్లలోకి వచ్చేందుకు ముస్తాబవుతోన్న ఈ మూవీ ట్రైలర్‌ను తాజాగా మేకర్స్ విడుదల చేశారు.
బాలీవుడ్‌లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ కామెడీ ఫ్రాంచైజీలలో ఒకటైన ‘ధమాల్’ (Dhamaal) సిరీస్ చిత్రాలలో భాగంగా ‘ధమాల్ 4’ (Dhamaal 4) ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. జూలై 10న ఈ చిత్రం గ్రాండ్‌గా రిలీజ్ అయ్యేందుకు ముస్తాబవుతోంది. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా మేకర్స్ ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఇంద్ర కుమార్ దర్శకత్వంలో వస్తోన్న ఈ సినిమా ట్రైలర్, పాత జ్ఞాపకాలను రీఫ్రెష్ చేస్తూ అవుట్ అండ్ అవుట్ హిలేరియస్ ఎంటర్‌టైనర్‌గా అలరిస్తోంది. మొదటి మూడు భాగాల తరహాలోనే ఈసారి కూడా ‘ఖజానా’ వేట నేపథ్యంలోనే కథ సాగుతుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాలోని కామెడీ డోస్‌ను మరింత ఎలివేట్ చేస్తున్నాయి.
ఈ ట్రైలర్‌లో ప్రధాన ఆకర్షణ అజయ్ దేవగన్, అర్షద్ వార్సి, రితేష్ దేశ్‌ముఖ్, జావేద్ జాఫ్రీల క్రేజీ కాంబినేషన్. ముఖ్యంగా అర్షద్, రితేష్, జావేద్‌ల మధ్య వచ్చే మార్క్ కామెడీ సీన్లు, వన్ లైనర్లు థియేటర్లలో నవ్వుల పువ్వులు పూయించడం ఖాయంగా కనిపిస్తోంది. అజయ్ దేవగన్ తనదైన మాస్ అండ్ సీరియస్ లుక్‌తోనే కామెడీ పండించగా, మిగిలిన గ్యాంగ్ చేసే వింత చేష్టలు, ముఖ్యంగా డేంజరస్ సిట్యువేషన్లలో వచ్చే సీన్లు నవ్వు తెప్పిస్తున్నాయి. ప్రతి పాత్రకు ఒక ప్రత్యేకమైన మేనరిజం సెట్ చేయడం ట్రైలర్‌లో ప్లస్ పాయింట్‌గా నిలిచింది. కాకపోతే, కొత్తదనం లోపించిందని మాత్రం అనిపిస్తోంది. ఇలాంటి కామెడీని ఇప్పటికే ప్రేక్షకులు చూసి ఉన్నారు. కొత్తగా ఏదైనా ట్రై చేయకుండా, ఇంతకు ముందు వచ్చిన మూడు భాగాల రూట్‌లోనే ఈ సినిమా రూపొందిందనే విషయం ఈ ట్రైలర్ తెలియజేస్తోంది.
ఇక ప్రొడక్షన్ వాల్యూస్ విషయానికి వస్తే.. ఈ చిత్రాన్ని టి-సిరీస్ ఫిలిమ్స్, మారుతి ఇంటర్నేషనల్, పనోరమా స్టూడియోస్ బ్యానర్లపై అజయ్ దేవగన్, భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, అశోక్ థాకేరియా, ఆనంద్ పండిట్, కుమార్ మంగత్ పాఠక్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. విజువల్‌గా సినిమా చాలా రిచ్‌గా కనిపిస్తోంది. ట్రైలర్‌లో వచ్చే ‘కైసే బనీ’ రీమిక్స్ సాంగ్ బీట్స్ హైలైట్‌గా నిలిచాయి. ఫైనల్‌గా ‘ఖజానా’ బేస్డ్ కాన్సెప్ట్‌తో వస్తోన్న ఈ ‘ధమాల్ 4’, ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తుందనేది తెలియాలంటే మాత్రం జూలై 10 వరకు వెయిట్ చేయాల్సిందే. ప్రస్తుతం ఈ ట్రైలర్ టాప్‌లో ట్రెండ్ అవుతోంది. ఇషా గుప్తా, సంజీదా షేక్, అంజలి ఆనంద్, రవి కిషన్ వంటి భారీ తారాగణం ఇందులో కీలక పాత్రలను పోషించారు.
ఇవి కూడా చదవండి:
వంగా ‘స్పిరిట్’ స్కెచ్‌కు బాక్సాఫీస్ షేక్ అవ్వడం ఖాయం!
1.6 కిలోల వెండి ఖడ్గం.. మొక్కు తీర్చుకున్న సీఎం విజయ్!
వారెవ్వా అనిల్ రావిపూడి.. నీ చర్యలు ఊహాతీతం!