సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

దీపిక ఎమోషనల్ పోస్ట్ వైరల్.. 'నా పాపను ఎత్తుకోవడం నాకు చాలా ఇష్టం'

ABN, Publish Date - Aug 03 , 2026 | 10:08 AM

రెండోసారి గర్భవతైన దీపిక పదుకోన్ తన కుమార్తె 'దువా'తో గడుపుతున్న అందమైన క్షణాలను అభిమానులతో పంచుకున్నారు.

Deepika Padukone

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకోన్ (Deepika Padukone) మరోసారి తన మాతృత్వానికి సంబంధించిన అందమైన క్షణాన్ని అభిమానులతో పంచుకున్నారు. వ్యక్తిగత జీవితానికి ఎంత ప్రాధాన్యం ఇస్తారో చెప్పేలా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన రీల్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రెండోసారి గర్భవతిగా ఉన్న దీపిక ప్రస్తుతం షూటింగ్‌లకు కొంత విరామం ఇచ్చి కుటుంబంతో ఎక్కువ సమయం గడుపుతున్నారు. ముఖ్యంగా తన కుమార్తె దువా (Dua) తో ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తున్నట్లు ఆమె పోస్టు ద్వారా వెల్లడించారు.

త‌రు తాజాగా పోస్టు చేసిన రీల్‌లో "గర్భవతిగా ఉన్నప్పుడు బరువులు ఎత్తకూడదని అందరూ చెబుతుంటారు. కానీ నా పాపను ఎత్తుకుని గడిపే ప్రతి క్షణం నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుందిష అంటూ పోస్టు చేశారు.దీంతో కెరీర్‌లో వరుస సినిమాలతో బిజీగా ఉంటూనే కుటుంబానికి కూడా సమాన ప్రాధాన్యం ఇస్తున్న దీపిక తీరు నెటిజన్ల ప్రశంసలు అందుకుంటోంది. దీపిక షూర్ చేసిన ఈ పోస్టుకు లక్షల సంఖ్యలో వ్యూస్, లైక్స్ వస్తుండగా, అభిమానులు హార్ట్ ఎమోజీలతో త‌మ అభిమానాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Aug 03 , 2026 | 10:23 AM