సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

దీపికా రెండో కూతురు పేరు తెలుసా.. ఎంత అద్బుతంగా ఉందో

ABN, Publish Date - Oct 20 , 2026 | 09:47 PM

బాలీవుడ్ స్టార్ సెలబ్రిటీ కపుల్ దీపికా పదుకొణె (Deepika Padukone) - రణ్‌వీర్‌ సింగ్‌ (Ranveer Singh) దంపతులు విజయదశమి పర్వదినం సందర్భంగా తమ అభిమానులకు ఒక చక్కటి శుభవార్త తెలిపారు. తమ రెండో కుమార్తెకు నామకరణం చేసినట్లు వారు సోషల్ మీడియా వేదికగా అధికారికంగా వెల్లడించారు.

Devi Padukone Singh

బాలీవుడ్ స్టార్ సెలబ్రిటీ కపుల్ దీపికా పదుకొణె (Deepika Padukone) - రణ్‌వీర్‌ సింగ్‌ (Ranveer Singh) దంపతులు విజయదశమి పర్వదినం సందర్భంగా తమ అభిమానులకు ఒక చక్కటి శుభవార్త తెలిపారు. తమ రెండో కుమార్తెకు నామకరణం చేసినట్లు వారు సోషల్ మీడియా వేదికగా అధికారికంగా వెల్లడించారు. తమ ముద్దులొలికే బుజ్జాయికి దేవీ పదుకొణె సింగ్‌ (Devi Padukone Singh) అనే పేరును ఖరారు చేసినట్లు ఈ దంపతులు తెలిపారు. ఈ సందర్భంగా వారు షేర్ చేసిన ఒక ప్రత్యేకమైన ఫొటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఆ ఫొటోలో వారి పెద్ద కుమార్తె దువా పదుకొణె సింగ్, చిన్నారి దేవీని ముద్దుాడుతుండగా, దీపికా, రణ్‌వీర్‌లు ఎంతో ఆనందంగా నవ్వుతూ కనిపిస్తున్నారు. ఈ క్యూట్ పిక్ చూసిన అభిమానులు, ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఈ స్టార్ కపుల్‌కు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు.


దీపికా - రణ్‌వీర్‌ల ప్రేమకథ ఎంతో రొమాంటిక్‌గా సాగింది. ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన అద్భుతమైన దృశ్య కావ్యం రామ్‌లీలా సినిమాతో ఈ జంట తొలిసారి తెరను పంచుకుంది. ఈ చిత్ర షూటింగ్ సమయంలోనే ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం కాస్తా గాఢమైన ప్రేమగా మారింది. అప్పటి నుంచి సుమారు ఆరేళ్ల పాటు టాలీవుడ్, బాలీవుడ్ సర్కిల్స్‌లో మోస్ట్ వాంటెడ్ కపుల్‌గా షికారు చేస్తూ తమ బంధాన్ని మరింత బలపరుచుకున్నారు.


సుదీర్ఘకాలం పాటు ప్రేమలో మునిగితేలిన ఈ జంట, చివరకు పెద్దల అంగీకారంతో ఒక్కటయ్యారు. ఇటలీలోని సుప్రసిద్ధ పర్యాటక ప్రాంతమైన లేక్ కోమోవద్ద విల్లా డెల్ బాల్బియానెల్లో వేదికగా వీరి వివాహం అత్యంత అట్టహాసంగా జరిగింది. వైవాహిక జీవితంలో అడుగుపెట్టిన ఆరేళ్ల తర్వాత ఈ స్టార్ కపుల్ తల్లిదండ్రులయ్యారు. 2024 సెప్టెంబరులో దీపికా పదుకొణె పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆ మొదటి కుమార్తెకు ఈ దంపతులు దువా పదుకొణె సింగ్‌ అని నామకరణం చేశారు. ఇక ఇప్పుడు చిన్న కూతురుకి దేవీ అని పేరు పెట్టడంతో అభిమానులు చాలా సంతోషంగా ఆ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ మధ్యకాలంలో అందరూ ఏవేవో నోరు తిరగని పేర్లు పెట్టి కన్ఫ్యూజ్ చేస్తుంటే.. దీప్ వీర్ మాత్రం అమ్మవారి పేరును తమ కూతురికి పెట్టడం అద్భుతంగా ఉందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం దీపికా.. అల్లు అర్జున్ సరసన రాకాలో నటిస్తోంది.

Updated Date - Oct 20 , 2026 | 09:50 PM