Daayra: ఇద్దరు స్టార్స్ ఉన్న ఉపయోగం లేకపోయింది!
ABN , Publish Date - Sep 21 , 2026 | 03:24 PM
పృథ్వీరాజ్ సుకుమారన్, కరీనా కపూర్ ప్రధాన పాత్రలు పోషించిన 'దాయ్‌రా' మూవీ ప్రేక్షకులను తీవ్ర నిరాశకు గురిచేసింది. పృథ్వీరాజ్ హోమ్ స్టేట్ కేరళంలోనూ ఈ సినిమా ఎలాంటి ప్రభావం చూపించలేకపోయింది.
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ (Kareena Kapoor), మలయాళ నట దర్శకుడు పృథ్వీరాజ్ (Prithviraj) కీలక పాత్రలు పోషించిన 'దాయ్‌రా' మూవీ సెప్టెంబర్ 18న విడుదలైంది. పేరొందిన నటీనటులు ఈ సినిమాలో చేయడం మాత్రమే కాదు మేఘన గుల్జార్ దీనికి దర్శకురాలు కావడం కూడా విడుదలకు ముందు సినిమాకు బజ్ క్రియేట్ కావడానికి కారణమైంది. 2019లో హైదరాబాద్‌లో వెటర్నరీ డాక్టర్ దిశా పై జరిగిన అత్యాచారం, హత్య, తదనంతర పరిణామాల నేపధ్యంలో 'దాయ్‌రా' మూవీని మేఘనా గుల్జార్ తెరకెక్కించారు. అయితే ఇప్పటికే ఈ కథాంశంపై రామ్ గోపాల్ వర్మ... ఆనంద్ చంద్ర దర్శకత్వంలో 2022లో 'ఆశా ఎన్ కౌంటర్' పేరుతో ఓ సినిమా నిర్మించారు. అందులో ఆకుల సోనియా, శ్రీకాంత్ అయ్యంగార్, ప్రవీణ్ రాజ్ తదితరులు కీలక పాత్ర పోషించారు. జనవరి 1న విడుదలై ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఏ రకంగానూ మెప్పించలేక పోయింది.
అదే ఘటన ఆధారంగా ఇప్పుడు హిందీలో తెరకెక్కిన 'దాయ్‌రా' సైతం బాక్సాఫీస్ బరిలో పేలవమైన స్పందన పొందింది. ఈ మూవీ ఓపెనింగ్ డే కేవలం 90 లక్షల నెట్ ను మాత్రమే వసూలు చేసింది. ఈ మధ్య కాలంలో మంచి విజయాలను నటుడు గానూ, దర్శకుడిగానూ కూడా పృథ్వీరాజ్ అందుకున్నాడు. కానీ అతని సొంత రాష్ట్రమైన కేరళంలోనూ 'దాయ్‌రా' ఎలాంటి ప్రభావం చూపించలేకపోయింది. హిందీ వర్షన్ 11.65 శాతం ఆక్యుపెన్సీని మొదటి రోజు పొందగా, కేరళంలో కేవలం 7 శాతం మాత్రమే ఆక్యుపెన్సీ ఉండటం అందరినీ ఆశ్చర్యానికి లోను చేసింది. కనీసం పృథ్వీరాజ్ సుకుమార్ ను చూసి కూడా జనాలు థియేటర్లకు రాలేదని ట్రేడ్ వర్గాలు వ్యాఖ్యానించాయి.
'దాయ్‌రా'కు ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ రాకపోవడానికి డివోషనల్ మూవీ 'హనుమాన్ అంశ్' కూడా ఓ కారణమని వారు చెబుతున్నారు. చిన్న సినిమాగా మొదలై పెద్ద సినిమాగా మారిపోయిన 'హనుమాన్ అంశ్' ఇప్పటికే రూ. 300 కోట్ల గ్రాస్ ను దాటేసింది. ఈ సినిమా ప్రభంజనం ముందు కొత్త సినిమానే అయినా 'దాయ్‌రా' తట్టుకోలేకపోయిందని వారు అంటున్నారు. అలానే దిశా సంఘటన జరిగి ఆరేడేళ్ళు గడిచిపోవడంతో దానిని దానిపై ఎవరూ ప్రత్యేకమైన దృష్టి పెట్టలేదని తెలిసింది. ఇదే తరహా సినిమాలు కొన్ని ఇప్పటికే వచ్చిఉండటం, మేఘనా గుల్జార్ తన గత చిత్రం 'తల్వార్' తరహాలో గ్రిప్పింగ్ గా ఈ కథను తెర మీద ప్రెజెంట్ చేయకపోవడం కూడా ఈ పరాజయానికి కారణాలుగా వారు విశ్లేషిస్తున్నారు. కరీనా కారణంగా హిందీ బెల్ట్‌లోనూ, దిశ హత్యోదంతంపై తెరకెక్కిండం వల్ల తెలుగు నాట కానీ, పృథ్వీరాజ్ కారణంగా కేరళంలో గానీ ఈ సినిమా కొంతలో కొంత ఆడుతుందని భావించిన మేకర్స్ ను ఈ సినిమా తీవ్ర నిరాశకు గురిచేసింది.
ఇవి కూడా చదవండి:
Rashmika Mandanna: షూటింగ్‌కు వెళ్లాలంటే.. వణుకు పుట్టింది
మళ్లీ ఏమైందిరా.. వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ రిలీజ్ డేట్‌పై సస్పెన్స్
Husharu Pittalu: ఒరేయ్.. ఏం సినిమారా ఇది.. ఇంట్లోవాళ్లతో చూస్తే చెప్పుతో కొడతారు