బాలీవుడ్ నటుడు.. భరత్ కపూర్ కన్నుమూత
ABN, Publish Date - Apr 28 , 2026 | 06:11 AM
హిందీ చిత్రసీమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ నటుడు భరత్ కపూర్(80) (Bharat Kapoor) కన్నుమూశారు.
హిందీ చిత్రసీమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ నటుడు భరత్ కపూర్(80) (Bharat Kapoor) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ముంబాయిలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మధ్యాహ్నం కార్డియాక్ అరెస్ట్‌తో తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. భరత్ కపూర్ మరణ వార్తను ఆయన సన్నిహిత మిత్రుడు, నటుడు అవతార్ గిల్ ధృవీకరించారు.
1970, 80, 90వ దశకాల్లో భరత్ కపూర్ ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించారు. సహాయ నటుడిగా, విలన్, పోలీస్ ఆఫీసర్, లాయర్ వంటి గంభీరమైన పాత్రల్లో ఆయన ప్రేక్షకులను మెప్పించారు. నూరి, రామ్ బల్‌రామ్, బజార్, గులామీ, ఆఖ్రీ రాస్తా, సత్యమేవ జయతే, స్వర్గ్, ఖుదా గవా వంటి అనేక సూపర్ హిట్ చిత్రాల్లో భరత్ కపూర్ నటించారు.