సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

హాట్ స‌మ్మ‌ర్‌లో.. అందాల‌ మెరుపులు

ABN, Publish Date - Apr 28 , 2026 | 10:09 PM

సినీ తారలు గ్లామరస్ మూమెంట్స్ తో ఫ్యాన్స్‌లో కొత్త జోష్‌ను నింపుతున్నారు.

bollywood tollywood celebs

సినీ తారలు గ్లామరస్ మూమెంట్స్ తో ఫ్యాన్స్ లో కొత్త జోష్ ను నింపుతున్నారు. అందాల మెరుపులతో కొందరు మనసు దోచుకుంటే... మరికొందరు ఫిట్‌నెస్ ట్రాన్స్‌ఫర్మేషన్స్‌తో కొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుడుతున్నారు. మ‌రి ముద్దుగుమ్మ‌లు మంగ‌ళ‌వారం ఎవరెవరు ఏం చేశారో ఈ కింద ఓ లుక్ వేయండి.

స్టార్ హీరోయిన్‌ పూజాహెగ్డే (Pooja Hegde) ట్రెడిషనల్ లుక్‌లో మెరిసిపోయింది. రీసెంట్‌గా తన పూర్వీకుల ఇంట్లో నిర్వహించిన పూజా కార్యక్రమంలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ఆమె కుటుంబ సభ్యులు బెట్టు నాగ బ్రహ్మస్థానంలో సంప్రదాయ పద్దతిలో ఆచారాలు నిర్వహించారు.

కన్నడ సంప్రదాయానికి చెందిన డెక్కెబలి కార్యక్రమాన్ని ఫ్యామిలీ మెంబర్స్‌తో కలిసి పూజా భక్తి శ్రద్దలతో చేసింది. అంతేకాక చిన్ననాటి జ్ఞాపకాలతో ముడిపడి ఉన్న ఈ ఇల్లు తనకు ఎంతో స్పెషల్ అని తెలిపిందీ భామ. మరోవైపు పెట్ డాగ్ జియాతో కలసి టైమ్ స్పెండ్ చేసింది భాగ్యశ్రీ బోర్సె (BhagyashriBorse).

ఎండల వేడి పెరగడంతో సెలబ్రిటీస్‌ చల్లని ప్రదేశాల వైపు మళ్ళుతున్నారు. ప్రణీత సుభాష్ (Pranita Subhash) ఐస్‌ల్యాండ్‌లో మంచు అందాలను ఆస్వాదిస్తూ రిలాక్స్ అవుతోంది. ఇక గ్లామర్ క్వీన్‌ నోరా ఫతేహి (Nora Fatehi) ఫొటోషూట్‌తో సందడి చేస్తోంది.

జీన్స్, టాప్‌తో నడుము అందాలను హైలైట్ చేస్తూ అమ్మడు ఇచ్చిన ఫోజులు యూత్‌ను ఆకట్టుకుంటున్నాయి. ఇటు పాయల్ రాజ్‌పుత్ ట్రెడిషనల్ లుక్‌లో మెరిసి.. తన సొగసుతో మరోసారి ఫాలోవర్స్ మనసులు దోచుకుంది. మరోవైపు ఎయిర్ పోర్ట్ లో రణవీర్ సింగ్, దీపికా పదుకొనే సింపుల్ అండ్ స్టైలిష్ లుక్ లో కనిపించి అందరి దృష్టిని ఆకర్షించారు.

ఫిట్ నెస్ కోసం తపన పడుతున్నారు పలువురు సినీతారలు. స్ట్రాంగ్ బాడీతో పాటు ఫీట్ గా కనిపించేందుకు ట్రైనర్ సాయంతో తమదైన స్టైల్లో వర్కౌట్స్ చేస్తూ అలరించారు. ఇక ఇషాన్ ఖట్టర్, సిద్ధార్థ్ మల్హోత్రా చేసిన వర్కౌట్స్ వీడియోస్ ఆకట్టుకున్నాయి. ఇటు మానుషి చిల్లర్ (Manushi Chhillar) జిమ్‌లో కిక్ బాక్సింగ్ చేస్తూ కనిపించగా.. భూమి పెడ్నేకర్, శ్రద్దాదాస్ చేసిన ఇంటెన్స్ వర్కౌట్స్ వావ్ అనిపించాయి.

Updated Date - Apr 28 , 2026 | 10:12 PM