61 ఏళ్ల వయసులో ఆమీర్ ఖాన్ మూడో పెళ్లి..!
ABN, Publish Date - Jun 03 , 2026 | 09:38 PM
ఇండస్ట్రీలో ప్రేమలు, పెళ్ళిళ్ళు ఎలా ఉంటాయో అందరికీ తెలుసు. ముఖ్యంగా బాలీవుడ్ లో ఎవరెవరు ప్రేమించుకుంటారు.. ? ఎప్పుడు పెళ్ళి చేసుకుంటారు.. ఎప్పుడు విడిపోతారు.. ? ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకుంటారు అనేది ఎవరికీ తెలియదు.
ఇండస్ట్రీలో ప్రేమలు, పెళ్ళిళ్ళు ఎలా ఉంటాయో అందరికీ తెలుసు. ముఖ్యంగా బాలీవుడ్ లో ఎవరెవరు ప్రేమించుకుంటారు.. ? ఎప్పుడు పెళ్ళి చేసుకుంటారు.. ఎప్పుడు విడిపోతారు.. ? ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకుంటారు అనేది ఎవరికీ తెలియదు. తాజాగా బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమీర్ ఖాన్ (Aamir Khan) మూడో పెళ్ళికి రెడీ అయ్యినట్లు వార్తలు వినిపిస్తోన్నాయి. గత కొంతకాలంగా ఆమీర్.. గౌరీ స్ప్రాట్ అనే మహిళతో రిలేషన్ లో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్న విషయం తెల్సిందే. ఎక్కడికి వెళ్ళినా ఈ జంట కలిసే కనిపిస్తున్నారు.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఆమీర్- గౌరీ వివాహబంధంలోకి అడుగుపెట్టనున్నారట. ఎలాంటి ఆర్భాటం లేకుండా ఆమీర్ ఖాన్ నివాసంలోనే అత్యంత నిరాడంబరంగా ఈ వివాహ వేడుక జరగనుంది. జూలై 5 న జరిగే ఈ ప్రైవేట్ ఈవెంట్‌కు బాలీవుడ్ టాప్ ఖాన్స్ అయిన షారూఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్‌లు హాజరయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే రెండు పెళ్లిళ్లు విఫలమైనా కూడా 61 ఏళ్ల వయసులో ఆమీర్ ఖాన్ సరికొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు రెడీ అవ్వడం బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.
ఆమీర్ మొదటి పెళ్ళిళ్ళ గురించి చెప్పాలంటే.. ఆయన మొదట 1986లో తన చిన్ననాటి స్నేహితురాలు రీనా దత్తాను రహస్యంగా వివాహం చేసుకున్నాడు. వీరికి జునైద్, ఐరా అనే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే, 16 ఏళ్ల సుదీర్ఘ వైవాహిక బంధం తర్వాత కొన్ని మనస్పర్థల కారణంగా వీరిద్దరూ 2002లో విడాకులు తీసుకుని విడిపోయారు. ఆ తర్వాత 2005లో కిరణ్ రావును ఆమీర్ రెండో పెళ్లి చేసుకున్నాడు. వీరికి సరోగసీ విధానం ద్వారా ఆజాద్ అనే కుమారుడు జన్మించాడు. కానీ, ఈ రెండో బంధం కూడా ఎక్కువ కాలం నిలవలేదు, 2021లో వీరిద్దరూ అధికారికంగా విడిపోతున్నట్లు ప్రకటించారు. ఇప్పుడు ముచ్చటగా ఆమీర్ మూడో పెళ్ళికి సిద్దమయ్యాడు. మరి ఈ పెళ్ళి అయినా జీవితకాలం నిలబడుతుందో లేదో చూడాలి.