సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

పెళ్ళిపీటలు ఎక్కనున్న టాక్సిక్ భామ..

ABN, Publish Date - May 05 , 2026 | 01:01 PM

ఈ ఏడాది చాలామంది సెలబ్రిటీలు వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. తాజాగా బాలీవుడ్ హీరోయిన్ హుమా ఖురేషి (Huma Qureshi) కూడా త్వరలోనే పెళ్ళిపీటలు ఎక్కుతోన్నట్లు బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది.

Huma Qureshi

ఈ ఏడాది చాలామంది సెలబ్రిటీలు వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. తాజాగా బాలీవుడ్ హీరోయిన్ హుమా ఖురేషి (Huma Qureshi) కూడా త్వరలోనే పెళ్ళిపీటలు ఎక్కుతోన్నట్లు బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. గ్యాంగ్స్ ఆఫ్ వసీపూర్ సినిమాతో కెరీర్ ని ప్రారంభించిన హుమా.. వరుస సినిమాలు చేస్తూ బాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది. హిందీలోనే కాకుండా అమ్మడు తమిళ్ లో రజనీకాంత్ నటించిన కాలా చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత అజిత్ నటించిన వలిమైలో కూడా కీలక పాత్రలో నటించి మెప్పించింది.


ఇక ప్రస్తుతం హుమా.. యశ్ మూవీ టాక్సిక్ లో నటిస్తోంది. 39 ఏళ్ళ హుమా గత కొన్నేళ్లుగా నటుడు రచిత్ సింగ్ తో డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వినిపించాయి. అయితే రిలేషన్ గురించి ఈ జంట ఎప్పుడు అధికారికంగా బయట చెప్పలేదు కానీ, ఎక్కడకు వెళ్లినా కలిసి వెళ్ళడంతో త్వరలోనే వీరు పెళ్ళి చేసుకోబోతున్నారని టాక్ నడిచింది.


తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం హుమా, రచిత్ వివాహం అక్టోబర్ లో జరగనుందని తెలుస్తోంది. ఇప్పటికే ఇరు వర్గాల కుటుంబ సభ్యులు పెళ్ళి గురించి మాట్లాడుకొని ఒక డేట్ ని ఫిక్స్ చేశారట. అత్యంత సన్నిహితుల మధ్యనే వీరి వివాహం జరగనుందని సమాచారం. మరి హుమా.. తన పెళ్లిని ముంబైలోనే చేసుకుంటుందా.. ? లేక రాజస్థాన్ లో చేసుకుంటుందా అనేది తెలియాల్సి ఉంది.

Updated Date - May 05 , 2026 | 01:54 PM