సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

భారీ సుమో రెజ్లర్ ని నమ్మించి ముంచేసిన వామికా గబ్బి.. ఎలానో చూడండి

ABN, Publish Date - Jul 08 , 2026 | 03:35 PM

సినిమాల్లోనే కాదు, రియల్ లైఫ్‌లోనూ తనదైన అల్లరితో ఎప్పుడూ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంటుంది బాలీవుడ్ బ్యూటీ వామికా గబ్బి (Wamiqa Gabbi).

Wamiqa Gabbi

సినిమాల్లోనే కాదు, రియల్ లైఫ్‌లోనూ తనదైన అల్లరితో ఎప్పుడూ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంటుంది బాలీవుడ్ బ్యూటీ వామికా గబ్బి (Wamiqa Gabbi). తెలుగులో సుధీర్ బాబు సరసన భలే మంచి రోజు సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. అప్పుడు ఈ చిన్నదాన్ని ఎవరూ గుర్తించలేదు. ఆ సినిమా పరాజయం అందుకోవడంతో వామికా.. బాలీవుడ్ లోనే సెటిల్ అయ్యింది. ప్రస్తుతం వామికా గబ్బి కెరీర్ పరంగా ఫుల్ బిజీగా ఉంటూ పాన్-ఇండియా స్టార్‌గా దూసుకుపోతోంది. తెలుగులో మోస్ట్ అవేటెడ్ స్పేస్ అండ్ యాక్షన్ థ్రిల్లర్ G2 లో నటిస్తుండగా.. తమిళంలో జీని, DC సినిమాలతో పాటు పలు క్రేజీ బాలీవుడ్ ప్రాజెక్ట్‌లు, వెబ్ సిరీస్‌లు కూడా ఆమె చేతిలో ఉన్నాయి.


ఇక ఇదంతా పక్కన పెడితే తాజాగా వామికా జపాన్ పర్యటన సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. జపాన్ సాంప్రదాయ సుమో రెజ్లింగ్‌ లో అమ్మడు కూడా పాల్గొంది. పాల్గొనడమేనా విన్నర్ గా కూడా నిలిచింది. ఏంటి.. నిజమా.. సుమో రెజ్లింగ్‌ నే వామికా ఓడించిందా అంటే.. నిజమే ఓడించింది. కానీ, ఎలాగో తెలుసా.. ఒక చిన్న ట్రిక్ తో.. అది ఏంటంటే.. గాలితో నింపిన ఒక పెద్ద సుమో సూట్ వేసుకుని నేరుగా రింగ్ లోకి దూకేసింది. మొదట రింగ్‌లోకి దిగి గంభీరంగా బిల్డప్ ఇచ్చిన వామికా, అకస్మాత్తుగా నవ్వుతూ వెళ్లి ఆ సుమో రెజ్లర్‌కు షేక్‌హ్యాండ్ ఇచ్చి గట్టిగా హగ్ చేసుకుంది. ఆ తర్వాత ఎంత బలం ఉపయోగించి నెట్టినా ఆ కొండలాంటి రెజ్లర్ కదల్లేదు. దీంతో రూట్ మార్చిన వామికా.. అకస్మాత్తుగా తన కంటిలో ఏదో పడినట్టు విపరీతంగా యాక్టింగ్ చేయడం స్టార్ట్ చేసింది. అది నిజమేనని నమ్మి ఆ సుమో రెజ్లర్ పాపం హెల్ప్ చేద్దామని దగ్గరకు రాగా.. ఇదే సందు అనుకున్న వామికా అస్సలు ఊహించని విధంగా అతడిని ఒక్కసారిగా రింగ్ అవతలికి నెట్టేసి మ్యాచ్ గెలిచేసింది. ఈ నమ్మించి ముంచేసే ఫన్నీ విక్టరీ తర్వాత రింగ్‌లోనే ఆమె వేసిన క్రేజీ డ్యాన్స్ హైలైట్‌గా నిలిచింది.


ఇక ఈ ఫన్నీ వీడియోని షేర్ చేసిన వామికా.. ఇలా గెలవడానికి తన దగ్గర నోట్స్ తీసుకోవాలని కోరింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక నెటిజన్స్.. వామికా వీడియో పై సరదాగా స్పందిస్తున్నారు. అలాంటి అమ్మాయి అడగాలే కానీ ఎన్నిసార్లు అయినా ఓడిపోతాను అని ఒకరు.. చాలా బాగా గెలిచావ్ అని ఇంకొందరు కామెంట్స్ చేస్తున్నారు.

Updated Date - Jul 08 , 2026 | 03:42 PM