సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Vidyut Jammwal: నగ్నంగా చెట్టు ఎక్కిన హీరో.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వీడియో

ABN, Publish Date - Jan 11 , 2026 | 11:32 AM

బాలీవుడ్ హీరో విద్యుత్ జమాల్ (Vidyut Jammwal) గురించి తెలుగు ప్రేక్షకులకు సైతం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యాక్షన్ హీరోగా అతనికి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది.

Vidyut Jammwal

Vidyut Jammwal: బాలీవుడ్ హీరో విద్యుత్ జమాల్ (Vidyut Jammwal) గురించి తెలుగు ప్రేక్షకులకు సైతం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యాక్షన్ హీరోగా అతనికి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇక తమిళ్ లో కొన్ని సినిమాల్లో విలన్ గా కూడా నటించాడు. విజయ్ నటించిన తుపాకీ సినిమాలో విలన్ గా నటించిన విద్యుత్ కి మంచి గుర్తింపు వచ్చింది. ఆ తరువాత సూర్య సికిందర్ లో కూడా ఆమంచి పాత్రలో మెప్పించాడు. ఇక కమాండో సిరీస్ లలో హీరోగా నటించాడు. గతేడాది రిలీజైన శివ కార్తికేయన్ మదరాసిలో కూడా విద్యుత్ విలన్ గా కనిపించాడు.

ఇక సినిమాల విషయం పక్కన పెడితే.. విద్యుత్ ఎక్కువగా కలరిపయట్టు సాధనలోనే కనిపిస్తాడు. హిమాలయాల్లో.. మంచు ప్రదేశాల్లో ఒంటిపై నూలు పోగు లేకుండా సాధన చేస్తూ కనిపిస్తాడు. తాజాగా విద్యుత్.. నగ్నంగా చెట్టు ఎక్కుతున్న వీడియోను అభిమానులతో షేర్ చేశాడు. కలరిపయట్టు సాధనలో భాగంగానే తాను ఇలా చెట్టు ఎక్కినట్లు చెప్పుకొచ్చాడు.

'కలరిపయట్టు సాధకుడిగా, నేను సంవత్సరానికి ఒకసారి సహజ యోగ సాధనలో మునిగిపోతాను. సహజ అంటే సహజ సౌలభ్యం మరియు సహజమైన స్థితికి తిరిగి రావడం, ప్రకృతితో మరియు అంతర్గత అవగాహనతో లోతైన సంబంధాన్ని పెంపొందించడం. శాస్త్రీయంగా, ఇది అనేక న్యూరోరిసెప్టర్లు మరియు ప్రొప్రియోసెప్టర్లను సక్రియం చేస్తుంది, ఇంద్రియాలను మెరుగుపరుస్తుంది. సమతుల్యత మరియు సమన్వయాన్ని మెరుగుపరుస్తుంది. ఇది ఎక్కువగా శరీర అవగాహన, మానసిక దృష్టి పెరుగుదలకు దారితీస్తుంది' అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

Updated Date - Jan 11 , 2026 | 11:32 AM