ప్రముఖ నటుడు నానా పటేకర్ కన్నుమూత
ABN, Publish Date - Oct 08 , 2026 | 07:47 AM
ప్రముఖ బాలీవుడ్, మరాఠీ నటుడు, నిర్మాత నానా పటేకర్ (76) (Nana Patekar) కన్నుమూశారు.
ప్రముఖ బాలీవుడ్, మరాఠీ నటుడు, నిర్మాత నానా పటేకర్ (75) (Nana Patekar) కన్నుమూశారు. ఓ చిత్రం షూటింగ్ విషయంలో గోవాలో ఉన్న ఆయనకు ఈ తెల్లవారుజామున 5.20 గంటల సమయంలో గుండెపోటు రావడంతో సన్నిహితులు హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రికి తరలించగా వైద్యులు 45 నిమిషాల పాటు సీపీఆర్ చేసినప్పటికీ ఆయనను బతికించలేక పోయారు. ఈ ఘటనపై మెడికో-లీగల్ కేసు (MLC) నమోదు అయిందని పోస్ట్‌మార్టం నిర్వహిస్తుంచనున్నట్లు మణిపాల్ హాస్పిటల్ చీఫ్ ఆఫ్ ఆంకాలజీ విభాగం డాక్టర్ శేఖర్ సల్కర్ తెలిపారు.
ఈ వార్త తెలిసి భారతీయ చలన చిత్ర పరిశ్రమ ఒక్కసారిగా షాక్ గురయింది. ముఖ్యంగా నానా పటేకర్ మరణవార్తతో హిందీ, మరాఠీ సినీ పరిశ్రమల్లో విషాదం నెలకొంది. తన విలక్షణమైన నటన, శక్తివంతమైన సంభాషణలతో దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరించిన ఆయన.. ఎన్నో గుర్తుండిపోయే పాత్రల్లో నటించారు.సుమారు నాలుగు దశాబ్దాలకు పైగా సాగిన సినీ ప్రయాణంలో నానా పటేకర్ తనదైన నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 1978లో వచ్చిన ‘గమన్’ చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ఆయన.. అనంతరం హిందీ, మరాఠీ భాషల్లో అనేక విభిన్న పాత్రల్లో నటించారు.
‘పరిందా’, ‘అగ్ని సాక్షి’, ‘అబ్ తక్ చప్పన్’, ‘వెల్కమ్’, ‘రాజ్‌నీతి’, ‘ది వ్యాక్సిన్ వార్’ వంటి చిత్రాలు ఆయన కెరీర్‌లో ప్రత్యేకంగా నిలిచాయి. రజినీకాంత్ నటించిన ‘కాలా’ చిత్రంలోనూ కీలక పాత్రలో కనిపించారు. అయితే.. నానా పటేకర్ ‘క్రాంతివీర్’, ‘నటసామ్రాట్’ చిత్రాలతో నటుడిగా విశేష గుర్తింపు పొందారు. ‘క్రాంతివీర్’ చిత్రంలోని అద్భుత నటనకు ఆయన ఉత్తమ నటుడిగా జాతీయ చలనచిత్ర అవార్డు అందుకున్నారు. సుమారు 70కి పైగా సినిమాల్లో నటించిన నానా పటేకర్ హిందీ, మరాఠీ చిత్రాలతో పాటు ఇతర భాషల ప్రేక్షకులకు కూడా సుపరిచితులు.
నటుడిగానే కాకుండా దర్శకుడు, రచయితగానూ తన ప్రతిభను చాటుకున్న నానా పటేకర్‌కు జాతీయ చలనచిత్ర అవార్డులు సహా పలు ప్రతిష్ఠాత్మక పురస్కారాలు లభించాయి. 2013లో భారత ప్రభుత్వం ఆయనను పద్మశ్రీతో సత్కరించింది. సినిమాలతో పాటు దేశ సేవలోనూ నానా పటేకర్ ప్రత్యేక గుర్తింపు పొందారు. ఆయన టెరిటోరియల్ ఆర్మీలో గౌరవ లెఫ్టినెంట్ కల్నల్ హోదాను పొందారు. అలాగే రైతుల సంక్షేమం కోసం సామాజిక సేవా సంస్థ ‘నామ్ ఫౌండేషన్’ను స్థాపించి.. రైతు కుటుంబాలకు అండగా నిలిచారు. నటుడిగా మాత్రమే కాకుండా సామాజిక సేవకుడిగానూ తనదైన ముద్ర వేశారు. నానా పటేకర్ మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.