సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Dhurandhar The Revenge: ఇదెక్క‌డి క్రేజ్‌రా.. రిలీజ్‌కు ముందే సునామీ సృష్టిస్తోంది

ABN, Publish Date - Mar 18 , 2026 | 10:00 PM

ఆదిత్య ధర్ తెరకెక్కించిన మోస్ట్ అవేటెడ్ యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్ 2’ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించేందుకు సిద్ధమైంది.

Dhurandhar

రణవీర్ సింగ్ (Ranveer Singh) ప్రధాన పాత్రలో దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన మోస్ట్ అవేటెడ్ యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్ 2’ (Dhurandhar The Revenge)బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించేందుకు సిద్ధమైంది. మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానున్న ఈ చిత్రం, అడ్వాన్స్ బుకింగ్స్‌లోనే రికార్డులను కొల్లగొడుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. కేవలం ముందస్తు విక్రయాల ద్వారానే వంద కోట్ల క్లబ్‌లో చేరిన ఈ సినిమా, ప్రస్తుత ట్రెండ్ చూస్తుంటే బాక్సాఫీస్ వద్ద కొత్త చరిత్రను లిఖించడం ఖాయంగా కనిపిస్తోంది.

భారీ అంచనాల మధ్య ఉగాది పండుగను పురస్కరించుకుని ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సినిమా విడుదల కంటే ఒకరోజు ముందుగానే ప్రత్యేక పెయిడ్ ప్రివ్యూలను ప్లాన్ చేయడంతో, టికెట్లు హాట్‌కేకుల్లా అమ్ముడవుతున్నాయి. సినీ వర్గాల సమాచారం ప్రకారం, కేవలం ప్రివ్యూల ద్వారానే సుమారు 40.54 కోట్ల రూపాయలు వసూలు కాగా, మొదటి రోజు అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో మరో 29 కోట్ల రూపాయలు వచ్చాయి. వీటికి తోడు ఓవర్సీస్ మార్కెట్‌లో సుమారు 60 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు సాధించడంతో, విడుదల కంటే రెండు రోజుల ముందే ఈ చిత్రం ఏకంగా 130 కోట్ల రూపాయలను తన ఖాతాలో వేసుకుంది.

దేశవ్యాప్తంగా దాదాపు 15,000 థియేటర్లలో ఈ సినిమాను అత్యంత భారీ స్థాయిలో ప్రదర్శించనున్నారు. అందుతున్న సమచారం ఇప్పటివరకు 4.7 లక్షల టికెట్లు అమ్ముడయ్యాయి. తెలుగు, హిందీ, తమిళం, కన్నడతో పాటు మలయాళ భాషల్లో ఏకకాలంలో విడుదలవుతున్న ఈ చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. రణవీర్ సింగ్ మాస్ అప్పీల్, ఆదిత్య ధర్ టేకింగ్ తోడవ్వడంతో సినీ ప్రియులు ఈ యాక్షన్ డ్రామాను వెండితెరపై చూసేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ సినిమా రన్ టైమ్ గురించి సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. దాదాపు 3 గంటల 55 నిమిషాల నిడివి ఉన్నట్లు వార్తలు వస్తుండటం విశేషం. ఇంత సుదీర్ఘమైన నిడివి ఉన్నప్పటికీ, కంటెంట్‌పై ఉన్న నమ్మకంతో ప్రేక్షకులు బుకింగ్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. సెన్సార్ రిపోర్ట్ అలాగే నిడివికి సంబంధించి అధికారిక సమాచారం కోసం అభిమానులు వేచి చూస్తున్నారు. మొత్తానికి ‘ధురంధర్ 2’ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించడం పక్కా అని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Updated Date - Mar 18 , 2026 | 10:00 PM