రిలీజ్‌కు ముందే సంచ‌ల‌నం..రూ.75 కోట్లకు 'రామాయణ' సంగీత హక్కులు

ABN , Publish Date - Jul 30 , 2026 | 12:15 PM

రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి, యశ్ నటిస్తున్న రామాయణ సినిమాకు మరో భారీ రికార్డు నెల‌కొల్పింది.

Ramayana

నమిత్‌ మల్హోత్రా నిర్మాణంలో నితీశ్‌ తివారీ (Nitish Tiwari) తెరకెక్కించిన‌ ‘రామాయణ’ (Ramayana) చిత్రంపై ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా భారీ బజ్‌ ఉన్న సంగతి తెలిసిందే. దాదాపు రెండు వేల కోట్ల బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన ఈ సినిమాలో రణ్‌బీర్‌ కపూర్‌ రాముడిగా, సాయి పల్లవి సీతగా, యశ్‌ రావణుడిగా కనిపించనున్నారు. తాజాగా విడుద‌ల చేసిన‌ట్రైల‌ర్‌కు ఊహించ‌ని విధంగా సూప‌ర్ పాజిటివ్ రావ‌డంతో సినిమాపై అంచ‌నాలు అమాంతం పెరిగాయి.

అయితే.. ఈ సినిమా గురించి ఓ ఆస‌క్తిక‌ర‌మైన వార్త నెట్టింట చ‌క్క‌ర్లు కొడుతోంది. ప్ర‌ముఖ హాలీవుడ్ సంగీత ద‌ర్శ‌కుడు హ‌న్స్ జిమ్మ‌ర్ (Hans Zimmer), ఏఆర్ రెహ‌మాన్ (AR Rahman) సంయుక్తంగా మ్యూజిక్ అందించారు. ఈ నేప‌థ్యంలో ఈ మూవీ సంగీత హక్కులను ప్ర‌ముఖ మ్యూజిక్ లేబుల్ సంస్థ టీ సిరీస్‌ రూ.75 కోట్ల రికార్డు ధరకు దక్కించుకుంది.

దీంతో ఇప్పటివరకూ రూ. 54 కోట్లతో టాప్‌ స్థానంలో ఉన్న ‘ధురంధర్‌ 2’ను ఈ చిత్రం వెనక్కునెట్టి ప్ర‌ధ‌మ స్థానంలో చోటు సంపాదించుకున‌ట్లు అయింది. అయితే ఈ విష‌యంలో అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది. రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానున్న ‘రామాయణ’మూవీ దీపావ‌ళికి థియేట‌ర్ల‌కు రానుంది.

Updated Date - Jul 30 , 2026 | 12:27 PM