సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Urvashi Rautela Vs Ai: బాల‌య్య భామ‌.. రూ.7 వేల కోట్లకు ఎస‌రు పెట్టిందిగా

ABN, Publish Date - Oct 01 , 2026 | 12:48 PM

పర్సనాలిటీ రైట్స్ ఉల్లంఘించారంటూ ఏఐ సంస్థలపై బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా ఏకంగా రూ.7 వేల కోట్ల భారీ నష్టపరిహారం డిమాండ్ చేయడం తీవ్ర కలకలం రేపింది.

Urvashi Rautela

పర్సనాలిటీ రైట్స్ ఉల్లంఘించారంటూ ఏఐ సంస్థలపై బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా (Urvashi Rautela) ఏకంగా రూ.7 వేల కోట్ల భారీ నష్టపరిహారం డిమాండ్ చేయడం తీవ్ర కలకలం రేపింది. ఈ నేప‌థ్యంలో.. 'మీరు ఏఐ కంపెనీని అభివృద్ధి చేసుకోండి. మీ బ్రాండ్ విలువను పెంచుకోండి. అంతేగానీ అనుమతి తీసుకోకుండా ఊర్వశి పేరును వ్యాపారంలోకి లాగొద్దు' అని బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా టీమ్ సోషల్ మీడియాలో స్పందించింది. పైగా లాస్ ఏంజెలెస్‌కు చెందిన ఏఐ సంస్థ నుంచి ఊర్వశి రౌతేలా టీమ్ ఏడు వేల కోట్ల రూపాయల నష్టపరి హారం డిమాండ్ చేసింది. ఊర్వశి పేరు, ఫొటోలు, వీడియోలను ముందస్తు అంగీకారం లేకుండా వినియోగించుకున్నారని అందులో ఆరోపించింది.

ఈ ఆరోపణలను ఖండించిన ఏఐ కంపెనీ సీఈఓ షీరాజ్ హసన్ (Sheeraz) స్పందించారు. అసలు టెక్నాలజీపై సరైన అవగాహన లేకుండా ఇలాంటి డిమాండ్లు చేయడం అర్థరహితమని కౌంటర్ ఇచ్చారు. ముందుగా ఊర్వశి ఆర్జి ఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి తెలుసుకోవాలని, వినోద రంగంలో దాని భవిష్యత్తు గురించి అవగాహన పెంచుకోవాలని ఉద్భోద చేశారు. మున్ముందు ఎంట‌ర్‌టైన్ మెంట్ ఫీల్డ్‌కు ఏఐ అత్యంత కీలకమని, దాని వృద్ధిని ఇలాంటి నిరాధార వివాదాలతో ఎవరూ ఆపలేరని ఆయన స్పష్టం చేశారు. చనిపోయిన నటీనటులతో పెర్ఫార్మ్ చేయించడం నుంచి, పలు భాషల్లో డబ్బింగ్ చెప్పించడం వరకు ఎన్నో చూడబోతున్నాం. వీటి మీద అవగాహన పెంచుకోవాలి. ఈ మార్పును ఆపలేరు' అని హసన్ పేర్కొన్నారు.

కాగా ఈ భామ తెలుగులో బాల‌కృష్ణ స‌ర‌స‌న డాకూ మ‌హారాజ్ సినిమాలో క‌థానాయిక‌గా న‌టించగా చిరంజీవి వాల్తేరు వీర‌య్య సినిమా మ‌రో ఒక‌ట్రెండు చిత్ర‌ల్లోనూ స్పెష‌ల్ సాంగ్స్‌ చేసి తెలుగు ప్రేక్ష‌కుల‌కు బాగా చేరువ‌యింది. కాగా సెలబ్రిటీల వ్యక్తిగత హక్కులు, వేగంగా ఎదుగుతున్న సరికొత్త సాంకేతిక పరిజ్ఞానం మధ్య మొదలైన ఈ లీగల్ వార్ ప్రస్తుతం ఇండస్ట్రీలో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

Updated Date - Oct 01 , 2026 | 01:09 PM