Disha Patani: వచ్చి పదేళ్లైంది.. ఇక ఆ పాత్రలే చేస్తా
ABN, Publish Date - Oct 08 , 2026 | 12:10 PM
ఇప్పటివరకు గ్లామర్‌కు ప్రాధాన్యం ఉన్న పాత్రల్లో నటించానని చెప్పిన దిశా పటాని.. ఇకపై బలమైన, వైవిధ్యమైన క్యారెక్టర్లు చేయాలని ఉందన్నారు.
టీవలే విడుదలై ఘనవిజయం సాధించిన ‘ఆవారాపన్ 2’ (Awarapan) తో ప్రేక్షకులను పలకరించారు దిశా పటాని (Disha Patani) . ప్రస్తుతం హాలీవుడ్ చిత్రం ‘హోలీగార్డ్స్ సాగా: ది పోర్టల్ ఆఫ్ ఫోర్స్’ (Holiguards Saga — The Portal of Force) లో నటిస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో గ్లామర్, నటన గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
‘నా తొలి చిత్రం ‘ఎమ్‌ఎస్ ధోనీ’ (MS Dhoni) విడుదలై పదేళ్లు అవుతోంది. ఈ ప్రయాణంలో చాలా విషయాలు నేర్చుకున్నా. ఇప్పటివరకూ ఎక్కువగా గ్లామర్‌కు ప్రాధాన్యం ఉన్న చిత్రాల్లో నటించాను.
ఇకపైన ఒకే తరహాలో కాకుండా వైవిధ్యంతో పాటు బలంగా ఉండే పాత్రలు చేయాలనుకుంటున్నా. ప్రేక్షకులతో పూర్తిగా కనెక్ట్ అవుతూ, కథను ముందుకు నడిపించే క్యారెక్టర్లను పోషించేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను’ అని చెప్పారు.