Bollywood: అర్జున్ రాంపాల్ రెండోపెళ్ళి!

ABN , Publish Date - Aug 22 , 2026 | 12:49 PM

ఏడేళ్ళ సహజీవనానికి అర్జున్ రాంపాల్ ఫుల్ స్టాప్ పెట్టేశాడు. తన ప్రియురాలు గాబ్రియెల్లాను శుక్రవారం గోవాలో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాడు. వీరికి ఇద్దరు మగపిల్లలు.

Arjun Rampal - Gabriella

నందమూరి బాలకృష్ణ 'భగవంత్ కేసరి' చిత్రంలో కీలక పాత్రను పోషించిన బాలీవుడ్ నటుడు అర్జున్ రామ్ పాల్ కు ఇటీవల విడుదలైన 'ధురంధర్' సీరిస్ మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. పాతికేళ్ళ క్రితం 'ప్యార్ ఇష్క్ ఔర్ మొహబ్బత్' సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అర్జున్ రామ్ కు కండల వీరుడిగా మంచి గుర్తింపు ఉంది. 2008లో వచ్చిన 'రాక్ ఆన్' మూవీతో జాతీయ స్థాయిలో ఉత్తమ సహాయ నటుడిగానూ అర్జున్ రాంపాల్‌ అవార్డును అందుకున్నాడు.


నటి, మోడల్‌ మెహర్ జెసియాను 1998లో వివాహం చేసుకున్న అర్జున్ రాంపాల్ 2019లో ఆమెకు విడాకులు ఇచ్చాడు. వారికి ఇద్దరు ఆడపిల్లలు. అదే సమయంలో గాబ్రియెల్లాతో అర్జున్ రామ్ పాల్ లివిన్ రిలేషన్ షిప్ మొదలు పెట్టాడు. వారికి ఇద్దరు కుమారులు. దాదాపు యేడేళ్ళ సహజీవనం తర్వాత ఇప్పుడు అర్జున్ రామ్ పాల్ గాబ్రియెల్లా డెమెట్రియాడెస్‌ను గోవాలో ఆగస్ట్ 21న రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాడు. పదహారేళ్ళ వయసులోనే మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టిన గాబ్రియెల్లా స్వదేశం దక్షిణాఫ్రికా. మోడలింగ్ రంగం నుంచి ఆమె ఫ్యాషన్ డిజైనర్ గా మారి, తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు.



ఇవి కూడా చదవండి:

అభినయంలోనూ ఆవిడ షావుకారే..

మామ ‘కాకా’.. అల్లుడు ‘రాకా’.. సరికొత్త సెంటిమెంట్

‘కదిరి నరసింహుడు’ కాదు.. ‘మెగా158’ టైటిల్ గ్లింప్స్ వచ్చేసింది.. అరాచకం అంతే!

Updated Date - Aug 22 , 2026 | 12:51 PM