సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

AR Rahman: ‘రామాయణ’ గర్వంగా ఉంది.. 12 భారీ సినిమాలు వదులుకున్నా

ABN, Publish Date - Nov 23 , 2026 | 07:53 AM

‘రామాయణ’ సినిమా కోసం మూడేళ్లు పనిచేశానని, ఈ ప్రాజెక్టు కోసం 10-12 భారీ చిత్రాలను వదులుకున్నానని సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ వెల్లడించారు.

AR Rahman

‘రామాయణ’ (Ramayana Movie) కోసం మూడేళ్లు కష్టపడ్డానని, ఆ సమయంలో ఆ జోన్‌లో ఉండటం కోసం దాదాపు 10-12 భారీ చిత్రాలను వదులుకోవాల్సి వచ్చిందని ప్రముఖ సంగీత దర్శకుడు ఎ.ఆర్‌.రెహమాన్ (AR Rahman) అన్నారు. ఇఫిలో ‘బెనారస్‌’ (Benaras Movie) చిత్ర ప్రదర్శనానంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఆస‌క్తిక‌ర విష‌యాలు పంచుకున్నారు.

‘రామాయణ కోసం 12-13 వెర్షన్లు ట్యూన్లు చేసిన సందర్భాలున్నాయి. ‘రావణ తాండవం’ (Ravana Tandav) కోసం 13 వెర్షన్ల దాకా కంపోజ్‌ చేశాను. అందులో నుంచి అందరికీ నచ్చిన వెర్షన్‌ని సినిమాలో పెట్టాం. ఇంత మంచి ప్రాజెక్ట్‌ చేసినందుకు గర్వపడుతున్నా. నేను, నా బృందం పనిచేయడాన్ని ఆస్వాదించగలమనే భరోసా కలిగినప్పుడే నేను ప్రాజెక్టుకు సంతకం చేస్తాను’ అని అన్నారు.

Updated Date - Nov 23 , 2026 | 07:53 AM