ధూమ్ 4.. తప్పుకున్న రణబీర్!
ABN, Publish Date - Jul 28 , 2026 | 11:38 AM
దేశ వ్యాప్తంగా అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ధూమ్ మూవీ అభిమానులకు ఓ న్యూస్ కలవర పెడుతోంది.
బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor) ప్రస్తుతం వరుస భారీ చిత్రాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. 'యానిమల్' తర్వాత దేశవ్యాప్తంగా ఆయనకు మరింత క్రేజ్ ఏర్పడగా ముఖ్యంగా తెలుగు ప్రేక్షకుల్లోను ప్రత్యేకమైన అభిమాన వర్గం ఏర్పడింది. ప్రస్తుతం ఆయన 'రామాయణ (Ramayana) సినిమా ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. దీంతో పాటు 'యానిమల్ పార్క్', 'బ్రహ్మాస్త్ర 2', సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కిస్తున్న 'లవ్ అండ్ వార్' చిత్రాలు కూడా రణ్‌బీర్ చేతిలో ఉన్నాయి. ఇదే సమయంలో ఆయన ధూమ్ 4 (Dhoom 4) లో నటించనున్నారనే వార్తలు గత కొంతకాలంగా బాలీవుడ్‌లో చక్కర్లు కొడుతున్నాయి.
ఇదిలాఉంటే.. యష్‌రాజ్ ఫిల్మ్స్ Yash Raj Films (YRF) నిర్మించిన ధూమ్ ఫ్రాంచైజీ భారతీయ యాక్షన్ సినిమాల్లో ప్రత్యేక గుర్తింపు ఉన్న సంగతి తెలిసందే. ముఖ్యంగా ఈ సినినిమాల్లో ప్రతి నియక పాత్రలు విలక్షణంగా ఉండి మంచి హైప్ సంపాదించుకున్నాయి. ఈక్రమంలో మొదటి భాగంలో జాన్ అబ్రహం, రెండో భాగంలో హృతిక్ రోషన్, మూడో భాగంలో ఆమీర్ ఖాన్ విలన్ పాత్రల్లో మెప్పించారు. దీంతో నాలుగో భాగంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే.. త్వరలో పట్టాలెక్కనున్న ధూమ్ 4లో రణ్‌బీర్ కపూర్ ప్రధాన పాత్రలో నటించనున్నారని, దర్శకుడు అయాన్ ముఖర్జీ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తారని ప్రచారం జరిగింది. ఆదిత్య చోప్రా, రచయిత శ్రీధర్ రాఘవన్ కలిసి స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నట్లు కూడా వార్తలు వచ్చాయి.
కాగా.. ఇప్పుడు ఈ సినిమా నుంచి రణబీర్ తప్పుకున్నారనే వార్తలు జోరుగా హల్‌చల్ చేస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం స్క్రిప్ట్ పూర్తిగా సంతృప్తికరంగా లేకపోవడంతో రణ్‌బీర్ కపూర్ ధూమ్ 4 నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఈ ప్రాజెక్ట్‌పై మళ్లీ అనిశ్చితి నెలకొంది. అంతేగాక ఇటీవల యష్‌రాజ్ నుంచి వచ్చిన వార్2, అల్పా సినిమాలు తీవ్రంగా నిరాశ పర్చడంతో ధూమ్ ఫ్రాంచైజీని పూర్తిగా రీబూట్ చేసే ఆలోచనలో ఉన్నట్లు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. కొత్త హీరోలు, కొత్త కథతో ధూమ్ సిరీస్‌ను మళ్లీ ప్రారంభించాలని సంస్థ భావిస్తున్నట్లు సమాచారం. అదే సమయంలో దర్శకుడు అయాన్ ముఖర్జీని కూడా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పించినట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై మాత్రం ఇప్పటివరకు అధికారిక ప్రకఅయితే రాలేదు కానీ సామాజిక మాధ్యమాల్లో విరివిగా ప్రచారం జరుగుతోంది. ధూమ్ 4 విషయంలో ఏం జరుగబోతుందనే విషయం మేకర్స్ ప్రటన తర్వాత మాత్రమే తెలిసే అవకాశం ఉంది.