సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

బుల్లెట్ ప్రూఫ్ షీల్డ్ వెనుక అమితాబ్ బచ్చన్.. జల్సా వద్ద బిగ్ బీని చూసి అభిమానులు షాక్!

ABN, Publish Date - Nov 02 , 2026 | 06:00 PM

అమితాబ్ బచ్చన్ ఈ ఆదివారం ముంబైలోని జల్సా నివాసం వద్ద బుల్లెట్ ప్రూఫ్ షీల్డ్ వెనుక నుంచి అభిమానులకు అభివాదం చేశారు. బాలీవుడ్‌లో బెదిరింపుల నేపథ్యంలో భద్రత పెంపు చర్చనీయాంశంగా మారింది.

Amitabh Bachchan

బాలీవుడ్‌లో వరుసగా జరుగుతున్న బెదిరింపులు, కాల్పుల ఘటనలు సినీ ప్రముఖుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) బుల్లెట్ ప్రూఫ్ అద్దం (Bulletproof Shield) వెనుక నిలబడి అభిమానులకు అభివాదం చేశారు.

ప్రతి ఆదివారం ముంబైలోని జుహూలో ఉన్న తన నివాసం జల్సా వద్దకు వచ్చే అభిమానులను బిగ్ బీ కలవడం ఆనవాయితీ. అయితే, ఈసారి ఆయన బుల్లెట్ ప్రూఫ్ షీల్డ్ వెనుక నిలబడి ఫ్యాన్స్‌కు అభివాదం తెలిపారు. ఇటీవల హీరో టైగర్ ష్రాఫ్ కారుపై లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ (Lawrence Bishnoi Gang) కాల్పులు జరపడం, అమితాబ్ ఇంటికి బాంబు బెదిరింపులు రావడంతో పోలీసులు భద్రతను భారీగా పెంచారు.

సాధారణంగా జల్సా గేటు వద్దకు వచ్చి అభిమానులకు నేరుగా అభివాదం చేసే అమితాబ్.. ఈసారి ప్రత్యేక భద్రతా ఏర్పాట్ల మధ్య కనిపించడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఆయనను చూసేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు అక్కడికి చేరుకున్నారు. బుల్లెట్ ప్రూఫ్ రక్షణ ఉన్నప్పటికీ అభిమానుల వైపు చిరునవ్వుతో చేతులు ఊపుతూ అభివాదం చేయడం విశేషం.

దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ ఆదివారం సంప్రదాయాన్ని అమితాబ్ ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. వయసుతో సంబంధం లేకుండా అభిమానులతో తనకున్న అనుబంధానికి ఆయన ఎంతో ప్రాధాన్యత ఇస్తుంటారు. అయితే, తాజా భద్రతా పరిణామాల నేపథ్యంలో ఆయన ఈ విధంగా కనిపించడం అభిమానుల్లో చర్చనీయాంశంగా మారింది.

ఒకవైపు ప్రముఖ నటులకు వస్తున్న బెదిరింపులు, మరోవైపు వారి నివాసాల వద్ద పెరుగుతున్న భద్రతా ఆంక్షలు బాలీవుడ్‌లో కొత్త ఆందోళనకు కారణమవుతున్నాయి. గతంలో అభిమానులతో ఎంతో స్వేచ్ఛగా గడిపిన సెలబ్రిటీలు ఇప్పుడు భద్రతా వలయాల మధ్య కనిపించడం అటు సెల‌బ్రిటీలు ఇటు అభిమానుల్లో కొత్త అందోళ‌న‌ను రేకెత్తిస్తోంది.

Updated Date - Nov 02 , 2026 | 06:01 PM