Ramayanam: రామాయణం.. అమిత్ షా ఏమన్నారంటే?
ABN, Publish Date - Nov 26 , 2026 | 12:45 PM
బాలీవుడ్లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిన చిత్రం ‘రామాయణ పార్ట్ 1’కు ప్రముఖుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి
బాలీవుడ్లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిన చిత్రం ‘రామాయణ పార్ట్ 1’కు (Ramayana) ప్రముఖుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ సినిమా బృందాన్ని అభినందించారు. నిర్మాత నమిత్ మల్హోత్రా, దర్శకుడు నితేశ్ తివారీ, కథానాయకుడు రణ్‌బీర్ కపూర్, కథానాయిక సాయిపల్లవి, సహ నిర్మాత నీరజ్ సంఘాయ్ అమిత్ షాను మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ భేటీలో రామాయణ ఇతిహాసం, భారతీయ సంస్కృతి, సంప్రదాయాల్లో దాని విశిష్టత గురించి ఆసక్తికరమైన చర్చ జరిగినట్లు తెలిసింది. రామాయణంలోని చారిత్రక, సాంస్కృతిక అంశాలపై అమిత్ షాకు ఉన్న లోతైన అవగాహన తమను ఎంతగానో ఆకట్టుకుందని చిత్ర బృందం వెల్లడించింది. భారతీయ వారసత్వ సంపదను ప్రపంచ ప్రేక్షకులకు పరిచయం చేసేలా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నందుకు ఆయన అభినందనలు తెలిపినట్లు చిత్ర బృందం పేర్కొంది.
ఈ భారీ ప్రాజెక్ట్‌కు నితేశ్ తివారీ దర్శకత్వం వహించగా, నమిత్ మల్హోత్రా నిర్మించారు. రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయిపల్లవి సీతాదేవిగా, యశ్ రావణుడిగా కనిపించనున్నారు. రవీ దూబే లక్ష్మణుడి పాత్రను, సన్నీ డియోల్ హనుమంతుడి పాత్రను పోషించారు. ఆస్కార్ విజేతలు ఏఆర్ రెహమాన్, హాన్స్ జిమ్మర్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.