Alia Bhatt : మాతృత్వం ఎలా మార్చేసింది అంటే..
ABN, Publish Date - Jan 01 , 2026 | 10:30 PM
బాలీవుడ్ బ్యూటీ అలియాభట్ (Alia Bhatt) వరుస చిత్రాలతో బిజీగా ఉంది. ఏడాదికి రెండు, మూడు చిత్రాలు పైప్‌లైన్‌లో ఉంటున్నాయి.
బాలీవుడ్ బ్యూటీ అలియాభట్ (Alia Bhatt) వరుస చిత్రాలతో బిజీగా ఉంది. ఏడాదికి రెండు, మూడు చిత్రాలు పైప్‌లైన్‌లో ఉంటున్నాయి. ఈ ఏడాది కూడా రెండు చిత్రాలు.. ‘ఆల్ఫా’, (Alpha) ‘లవ్ అండ్ వార్’తో (Love and war) సందడి చేయడానికి రెడీగా ఉంది. అయితే ఇప్పుడామె ఓ నిర్ణయం తీసుకుంది. ఇకపై ఒకేసారి రెండు మూడు సినిమాలు చేయాలనుకోవట్లేదని చెబుతోంది. నటిగా సినిమాలతో బిజీగా ఉంటూనే మరో వైపు తల్లిగా తన బాధ్యతలను నిర్వర్తిస్తుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అలియా.. మాతృత్వం ఆమెను ఎలా మార్చిందో చెప్పుకొచ్చింది. ఈ మేరకు ఆసక్తికర విషయాలు తెలిపింది.
‘రాహా (raha)మా జీవితంలోకి వచ్చిన తర్వాత వృత్తిలో చాలా మార్పులు వచ్చాయి. నా బిడ్డ గురించి పట్టించుకోవాలి కాబట్టి.. పనిలో వేగం తగ్గింది. అయినా తృప్తిగా, సంతోషంగానే ఉన్నా. ఒకే సినిమా చేస్తూ.. ఎంచుకున్న పాత్రకు న్యాయం చేస్తున్నా. ఇంతక ముందు ఒకేసారి రెండు, మూడు చిత్రాలకు సైన్ చేసేదానిని.. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. తల్లి అయిన తర్వాత యాక్షన్ సన్నివేశాలు చేయడం సవాలుతో కూడిన పని. ప్రస్తుతం నేను నటిస్తున్న ‘ఆల్ఫా’ చిత్రంలో భారీ యాక్షన్ సీక్వెన్స్‌లో పాల్గొంటున్నా. బిడ్డ పుట్టిన తర్వాత ఇలా చేయడం ఉత్సాహంగా ఉంది. ఎందుకంటే ఇది నా శరీరం సత్తా ఏంటో నాకు చూపిస్తుంది. నా శరీరం పట్ల గౌరవాన్ని పెంచింది’ అని అన్నారు.