సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

తుంబాడ్ 2.. భయపెట్టడానికి సిద్దమైన అలియా

ABN, Publish Date - Jul 14 , 2026 | 07:14 PM

భారతీయ చలనచిత్ర రంగంలో సరికొత్త మైలురాయిగా నిలిచిన ఫోక్‌లోర్ హారర్ చిత్రం తుంబాడ్ (Tumbbad). ఇది ఎంత స్పెషల్ అంటే.. రిలీజ్ ఏయినప్పటి కంటే.. రీ రిలీజ్ అయినప్పుడు ఎక్కువ కలక్షన్స్ రాబట్టి ఇండస్ట్రీని షేక్ చేసింది.

Tumbbad 2

భారతీయ చలనచిత్ర రంగంలో సరికొత్త మైలురాయిగా నిలిచిన ఫోక్‌లోర్ హారర్ చిత్రం తుంబాడ్ (Tumbbad). ఇది ఎంత స్పెషల్ అంటే.. రిలీజ్ ఏయినప్పటి కంటే.. రీ రిలీజ్ అయినప్పుడు ఎక్కువ కలక్షన్స్ రాబట్టి ఇండస్ట్రీని షేక్ చేసింది. అంతేనా కొత్త సినిమాలతో పోటాపోటీగా రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమాకు సీక్వెల్‌ ను మేకర్స్ ఎప్పుడో ప్రకటించారు. ఈ భారీ సీక్వెల్ చిత్రానికి ఆదేశ్ ప్రసాద్ దర్శకత్వం వహిస్తోండగా సోహమ్ షా ఫిల్మ్స్ మరియు పెన్ స్టూడియోస్ సంయుక్త భాగస్వామ్యంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సీక్వెల్ తెరకెక్కనుంది. మొదటి భాగంలో తన అద్భుత నటనతో మెప్పించిన సోహమ్ షా ఈ సీక్వెల్‌లోనూ ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. వర్సటైల్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్దికీ ఇందులో మరో కీలక పాత్రలో కనిపించనున్నారు.


ఇక ఈ సినిమా సీక్వెల్ కి సంబంధించిన ఒక భారీ క్రేజీ అప్‌డేట్ ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. గత కొన్నిరోజులుగా తుంబాడ్ 2లో బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తోందని వార్తలు వినిపిస్తోన్న విషయం తెల్సిందే. తాజాగా ఆ వార్తలను నిజం చేస్తూ మేకర్స్ అలియా భట్‌ను తుంబాడ్ 2 ప్రాజెక్ట్‌లోకి ఘనంగా ఆహ్వానించారు. అలియారాకతో ఈ హారర్ త్రిల్లర్‌పై అంచనాలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకాయి.


విశిష్టమైన విలేజ్ బ్యాక్‌డ్రాప్, మిస్టరీ, జానపద కథాంశంతో రూపుదిద్దుకోనున్న తుంబాడ్ 2 లో అలియా భట్ ఎలాంటి పాత్ర పోషించబోతోందనేది ఇప్పుడు బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. పెన్ స్టూడియోస్ ప్రొడక్షన్ వాల్యూస్, ఆదేశ్ ప్రసాద్ టేకింగ్ ఈ సీక్వెల్‌ను మరింత గ్రాండ్‌గా మార్చనున్నాయి. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి. మరి ఈ సినిమాతో అలియా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Updated Date - Jul 14 , 2026 | 07:17 PM