విలాసవంతమైన అపార్ట్‌మెంట్‌లోకి అక్షయ్ ఖన్నా!
ABN , Publish Date - Sep 29 , 2026 | 11:05 AM
బాలీవుడ్ స్టార్ క్యారెక్టర్ యాక్టర్ అక్షయ్ ఖన్నా మలబార్ హిల్ సమీపంలో విలాసవంతమైన అపార్ట్ మెంట్‌ను కొనుగోలు చేశారు. 'ధురంధర్', 'ఛావా' చిత్రాల తర్వాత అక్షయ్ ఖన్నా కెరీర్ జడ్ స్పీడ్‌లో దూసుకుపోతోంది.
ప్రముఖ బాలీవుడ్ నటుడు అక్షయ్ ఖన్నా దశ తిరిగింది. 'ధురంధర్' సీరిస్‌తో ఓవర్ నైట్ అక్షయ్ ఖన్నా మోస్ట్ వాంటెండ్ క్యారెక్టర్ ఆర్టిస్టుల జాబితాలోకి వెళ్ళిపోయాడు. అలానే 'ఛావా' సినిమాలో పోషించిన ఔరంగజేబు పాత్ర సైతం అతనికి నటుడిగా గొప్ప పేరు తీసుకొచ్చింది. ఇప్పుడు పలు పరభాషా చిత్రాలలోనూ నటించడానికి అక్షయ్ ఖన్నా ఆసక్తి చూపుతున్నాడు. అందులో భాగంగానే మొదటిసారి తెలుగులో 'మహాకాళి' సినిమాలో శుక్రాచార్యుని పాత్రను అక్షయ్ ఖన్నా చేస్తున్నాడు. హీరోగా నటించిన సినిమాలు పెద్దంత విజయాన్ని అందుకోకపోయినా... ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనదైన సత్తాను చాటుతున్నాడు.
ఇదిలా ఉంటే... అక్షయ్ ఖన్నా తాజాగా ముంబైలోని అత్యంత ఖరీదైన మలబార్ హిల్ ప్రాంతంలో ఏకంగా 33.26 కోట్ల విలువచేసే విలాసవంతమైన అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేశాడు. ఇటీవల దీని రిజిస్ట్రేషన్ కార్యక్రమాలూ పూర్తయ్యాయి. ఈ అపార్ట్‌మెంట్ మలబార్ హిల్ రోడ్‌లోని 30 లిటిల్ గిబ్స్‌లో ఉంది. సీ వ్యూ ఉన్న ఈ ఏరియా నారిమన్ పాయింట్, కొలాబాలకు అనుసంధానం కావడంతో ఎంతో ప్రసిద్ధి చెందింది. బాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖులు ఇక్కడే నివాసం ఏర్పాటు చేసుకున్నారు. అక్షయ్ ఖన్నా కు ఇరుగు పొరుగులో ప్రముఖ నటీమణులు జూహీ చావ్లా, ఐశ్వర్యారాయ్ బచ్చన్, సన్నీ డియోల్, సిమి గరేవాల్ తదితరులు నివాసం ఉంటున్నారు. మరి ఈ కొత్త ప్లాట్‌లోకి అడుగుపెట్టిన తర్వాత అక్షయ్ ఖన్నాకు మరెంతగా కలిసి వస్తుందో చూడాలి.
ఇవి కూడా చదవండి:
16 ఏళ్లకే ఇల్లు వదిలి వచ్చేసిన అక్కినేని కోడలు..
నెట్‌ఫ్లిక్స్ వేదికగా చిరంజీవి అన్‌ఫిల్టర్డ్ స్టోరీస్..
Devara 2: ఫ్యాన్స్ వెయిటింగ్‌కు ఎండ్ కార్డ్? కథలో మార్పులకు ఓకే చెప్పిన తారక్?