అక్షయ్ కుమార్.. భూత్ బంగ్లా ట్రైలర్
ABN, Publish Date - Apr 06 , 2026 | 04:04 PM
హిందీ అగ్ర నటుడు అక్షయ్ కుమార్ హీరోగా, ప్రియదర్శన్ దర్శకత్వంలో తెరకెక్కిన నూతన చిత్రం భూత్ బంగ్లా.
హిందీ అగ్ర నటుడు అక్షయ్ కుమార్ (Akshay Kumar) హీరోగా ప్రియదర్శన్ (Priyadarshan) దర్శకత్వంలో తెరకెక్కిన నూతన చిత్రం భూత్ బంగ్లా (Bhooth Bangla). వామికా గబ్బి (Wamiqa Gabbi) కథానాయిక. టబు (Tabu), పరేశ్ రావల్ (Paresh Rawal), రాజ్ పాల్ యాదవ్ (Rajpal Yadav), మిథిలా పాల్కర్ (Mithila Palkar), జిష్ణు సేన్ గుప్తా (Jisshu Sengupta) కీలక పాత్రలు చేశారు. హర్రర్, కామెడీ జానర్ లో రూపొందిన ఈ మూవీ ఏప్రిల్ 16న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లకు రానుంది.
ఈ నేపథ్యంలో ఇప్పటికే విడుదల చేసిన టీజర్ 30 మిలియన్ల వ్యూస్ దక్కించుకుని ట్రెండింగ్‌లో ఉండగా.. తాజాగా సోమవారం ఈ చిత్రం ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్‌ను చూస్తే.. ఔట్ అండ్ ఔట్ కామెడీతో అల్లాడించేందుకు సిద్దమైనట్లు స్పష్టంగా అర్థమవుతోంది. ఓ పెద్ద బంగ్లాకు హీరో రావడం, అక్కడ దయ్యం, ఈ నేపథ్యంలో సిట్యువేషన్ పరంగా వచ్చే సన్నివేశాలతో ఆద్యంతం నవ్వులు పూయిస్తూ ట్రైలర్ సాగింది. అయితే గ్రాఫిక్స్ మాత్రం ఆది పురుష్ చిత్రం నుంచి కాపీ చేసినట్లు స్పష్టంగా తెలుస్తోంది.