సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Akshay Kumar Car Accident: విహారానికి వెళ్లొస్తుండగా అక్షయ్ కారుకు ప్రమాదం

ABN, Publish Date - Jan 20 , 2026 | 09:48 AM

బాలీవుడ్ నటుడు అక్షయ్‌ కుమార్‌ కారు ప్రమాదానికి గురైంది. జుహు ప్రాంతంలో అతి  వేగంగా వచ్చిన ఓ కారు అటుగా వెళ్తున్న ఆటోని ఢీకొట్టింది. 

బాలీవుడ్ నటుడు అక్షయ్‌ కుమార్‌ (Akshay kumar) కారు ప్రమాదానికి గురైంది. జుహు ప్రాంతంలో అతి  వేగంగా వచ్చిన ఓ కారు అటుగా వెళ్తున్న ఆటోని ఢీకొట్టింది.  ఆటో అదుపుతప్పి అక్షయ్‌ (Akshay Kumar) కాన్వయ్‌ పైకి దూసుకెళ్లింది. దీంతో అక్షయ్‌ ప్రయాణిస్తున్న కారు,  సెక్యూరిటీ కాన్వాయ్‌లోని మరో కారు ఢీకొన్నాయి. అక్షయ్  ఎస్కార్ట్‌ కారు బోల్తా కొట్టింది. ఆ సమయంలో కారులో అక్షయ్, ట్వింకిల్‌ ఖన్నా ఉన్నారు. (Akshay kumar car accident)

తమ 25వ పెళ్లి రోజును విదేశాల్లో సెలబ్రేట్‌ చేసుకుని ఎయిర్‌పోర్టు నుంచి తిరిగివస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అయితే ప్రమాదంలో  ఎవరికి  హానీ జరగలేదు. దీనికి సంబందించిన ఫోటోలు వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఈ ప్రమాదం నుంచి అక్షయ్‌ దంపతులు క్షేమంగా బయటపడటంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఆటో డ్రైవర్‌కు గాయాలు కావడంతో అతడిని సమీప ఆసుపత్రికి తరలించారు. ౨౫ ఏళ్ళ వైవాహిక బంధం, తమ పెళ్లినాటి రోజులను గుర్తు చేసుకుంటూ ఈ నెల  18న ఓ భావోద్వేగ పోస్ట్ చేశారు అక్షయ్ దంపతులు. '25 ఏళ్ల జర్నీ ఇది' అంటూ వీడియో షేర్ చేశారు.

Updated Date - Jan 20 , 2026 | 09:48 AM