SAMUK: ఇండియాస్.. ఫస్ట్ ఎలియన్ సర్వైవల్ థ్రిల్లర్
ABN, Publish Date - May 25 , 2026 | 02:31 PM
వరుస చిత్రాలతో ప్రేక్షకులను పలకరించే బాలీవుడ్ కథానాయకుడు అక్షయ్‌కుమార్ మరో క్రేజీ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
వరుస చిత్రాలతో ప్రేక్షకులను పలకరించే బాలీవుడ్ కథానాయకుడు అక్షయ్‌కుమార్ (Akshay Kumar) మరో క్రేజీ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమా టైటిల్ ‘సముఖ్’ (SAMUK). ‘సనక్’ (Sanak)ఫేమ్ కనిష్క్ వర్మ (Kanishk Verma) దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని అమృత్‌లాల్ షా విపుల్ నిర్మిస్తున్నారు.
అయితే.. ఈ చిత్రంలో అక్షయ్ పూర్తిస్థాయి యాక్షన్ రోల్‌లో కనిపించనుండగా. ఏలియన్ (Alians) సర్వైవల్ థ్రిల్లర్‌గా దీన్ని రూపొందించనున్నారు. ఈ తరహా కథాంశంతో వస్తున్న తొలి భారతీయ చిత్రమిదని కనిష్క్ పేర్కొన్నారు. తనకు ఎంతో ఇష్టమైన హాలీవుడ్ చిత్రాలు ‘ఏలియన్’, ‘ప్రిడేటర్’ వంటివి దీనికి స్ఫూర్తిగా నిలిచాయని చెప్పారు.
ప్రేక్షకులు చూసే అతిగొప్ప సినిమాల్లో ఇది ఒకటిగా నిలుస్తుందన్నారు. ఇందులోని పోరాట ఘట్టాలు అద్భుతంగా రావడానికి అంతర్జాతీయ టెక్నీషియన్లతో పనిచేయనున్నట్లు తెలిపారు. అత్యాధునిక సాంకేతిక హంగులతో ముస్తాబవుతున్న ఈ చిత్రాన్ని త్వరలోనే సెట్స్‌పైకి తీసుకెళ్లనున్నారు.