సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

విల‌న్‌గా.. అక్ష‌య్ కుమార్‌! ‘హైవాన్’ ట్రైల‌ర్ రిలీజ్‌.. ఆ సినిమాకు కాఫీలా ఉందే

ABN, Publish Date - Aug 25 , 2026 | 07:38 PM

సుమారు 18 ఏళ్ల విరామం అనంత‌రం బాలీవుడ్ స్టార్ హీరోలు అక్షయ్ కుమార్, సైఫ్ అలీ ఖాన్ క‌లిసి న‌టిస్తోన్న యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘హైవాన్’.

Haiwaan

సుమారు 18 ఏళ్ల విరామం అనంత‌రం బాలీవుడ్ స్టార్ హీరోలు అక్షయ్ కుమార్ (Akshay Kumar), సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan) క‌లిసి న‌టిస్తోన్న యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘హైవాన్’ (Haiwaan). స్టార్ డైరెక్ట‌ర్ ప్రియ‌ద‌ర్శ‌న్ (Priyadarshan) ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. కెవిఎన్ ప్రొడక్షన్స్, థెస్పియన్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో బోమన్ ఇరానీ, సయామీ ఖేర్, శ్రియా పిల్గాంకర్, షరీబ్ హష్మీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని వెంకట్ కె. నారాయణ, శైలజ దేశాయ్ ఫెన్ నిర్మిస్తున్నారు.

ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ హిందీ చిత్రం సెప్టెంబ‌ర్ 11న ప్ర‌పంచ వ్యాప్తంగా థియేట‌ర్ల‌లోకి రానుంది. ఈ నేప‌థ్యంలో మేక‌ర్స్ తాజాగాఈ చిత్రం ట్రైల‌ర్ విడుద‌ల చేశారు. ఈ ట్రైల‌ర్‌ను ప‌రిశీలిస్తే.. 2016లో ప్రియ‌ద‌ర్శ‌న్ డైరెక్ష‌న్‌లోనే మోహ‌న్ లాల్ హీరోగా వ‌చ్చిన మ‌ల‌యాళ బ్లాక్ బ‌స్ట‌ర్ ఒప్పం (తెలుగులో క‌నుపాప‌) సినిమాను పోలి ఉండ‌డం స్ప‌ష్టంగా అవ‌గ‌త‌మ‌వుతోంది. ఈ సినిమాలో అక్షయ్ కుమార్ టైటిల్ పాత్రలో కనిపించగా, ఇటీవల విభిన్న పాత్రలతో ఆకట్టుకుంటున్న సైఫ్ అలీ ఖాన్ పూర్తిగా భిన్నమైన షేడ్‌లో అంధుడిగా కనిపించనున్నాడు. వీరిద్దరి స్క్రీన్ ప్రెజెన్స్, ఇంటెన్స్ సన్నివేశాలు ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించేలా ఉన్నాయి. యాక్షన్, థ్రిల్, ఎమోషన్ అంశాలను మేళవించిన కథ ప్రేక్షకులను ఆకట్టుకునేలా కనిపిస్తోంది.

ప్ర‌తినాయ‌క పాత్ర‌ధారి ‘హైవాన్’ అంధుడైన హీరోను అనుక్ష‌ణం వెంటాడుతూ ఇబ్బందులు సృష్టించ‌డం వాటిని హీరో ఎలా అధిగ‌మించడం, ఆ ఇద్ద‌రి చుట్టూ సాగే ఛేజింగ్ సన్నివేశాలు, హై-ఆక్టేన్ యాక్షన్ ఎపిసోడ్స్ ప్రధాన హైలైట్‌గా నిలిచాయి. విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, యాక్షన్ డిజైన్ సినిమాపై అంచనాలను మరింత పెంచుతున్నాయి. అయితే.. అప్పం సినిమాలోనూ హీరో అంధుడు కావ‌డం ఓ పాప‌ను చంపాల‌నుకున్న వ్య‌క్తిని అడ్డుకుంటూ పాప‌ను ర‌క్షించే నేప‌థ్యంలో మూవీ సాగుతుంది. ప్ర‌స్తుతం ఈ ‘హైవాన్’ ట్రైలర్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. మీరూ ఓ లుక్ వేయండి.

Updated Date - Aug 25 , 2026 | 07:57 PM