బాక్సాఫీస్ వద్ద.. హిందీ ‘దృశ్యం 3’ సెన్సేషన్
ABN, Publish Date - Oct 05 , 2026 | 07:29 AM
ఒరిజినల్ మలయాళ కథపై ఆధారపడకుండా సరికొత్త కథనంతో వచ్చిన హిందీ ‘దృశ్యం-3: ది కంక్లూజన్’ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.
ఒరిజినల్ మలయాళ కథపై ఆధారపడకుండా సరికొత్త కథనంతో వచ్చిన హిందీ ‘దృశ్యం-3: ది కంక్లూజన్’ (Drishyam: The Conclusion) బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. అజయ్ దేవగణ్ (Ajay Devgn) పవర్‌ఫుల్ పర్‌ఫార్మెన్స్‌తో పాటు జైదీప్ అహ్లావత్ (Jaideep Ahlawat) నటన సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్‌గా నిలిచాయి.
శుక్రవారం విడుదలైన ఈ చిత్రం తొలి రోజే దేశంలో రూ. రూ.66.75 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టింది. విదేశాల నుంచి మరో రూ. 15 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. దీంతో అజయ్ దేవ్‌గణ్ కెరీర్‌లోనే ఇది ఆల్ టైమ్ రికార్డ్ ఓపెనింగ్‌గా నిలిచింది. కేవలం రెండు రోజుల్లోనే వంద కోట్ల క్లబ్‌లోకి దూసుకెళ్లింది.అంతేకాదు బాలీవుడ్‌లోనే తొలి రోజు అత్యధిక వసూళ్లు రాబట్టిన మూడో చిత్రంగా దృశ్యం 3 నిలిచింది. మొదటి స్థానంలో 'ధురంధర్-2', రెండో స్థానంలో 'జవాన్' నిలిచాయి.
శనివారం రోజు ఈ చిత్రం రూ.55 కోట్ల వరకు రాబట్టగా మౌత్ టాక్ స్ప్రెడ్ అవడంతో ఆదివారం కూడా అదే స్థాయిలో కలెక్షన్లు కొల్లగొట్టి మూడు రోజుల్లోనే రూ.150 కోట్ల క్లబ్‌లో చేరి కొత్త రికార్డులు నెలకొల్పింది. ముఖ్యంగా విదేశాలలో అశించిన దానికి మిన్నగా ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరిస్తుండడంతో భారీ వసూల్లు వచ్చి పడుతున్నాయి. కేవలం రూ.20 కోట్ల లోపు బడ్జెట్‌తో ఇటీవల వచ్చిన మాతృక స్టోరీకి సంబంధం లేకుండా సరికొత్త ఒరిజనల్ కథతో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టిస్తోంది.
మరోవైపు ఇప్పటికే విడుదలై కేరళలో మాత్రమే విజయం సాధించిన మలయాళ వెర్షన్ మోహన్ లాల్ దృశ్యం 3 తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. తాజాగా వచ్చిన హిందీ దృశ్యం3 పర్ఫెక్ట్ ఎండింగ్‌తో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. సరికొత్త రికార్డులు సృష్టిస్తూ ఈ ఫ్రాంఛైజీకి హిందీ మేకర్స్ అదిరిపోయే ముగింపునిచ్చారని ప్రశంసలు సైతం అందుకుంటోంది. ప్రధానంగా అక్షయ్ ఖన్నా ఊహించని విధంగా తప్పుకోవడం సినిమాకు బాగా కలిసి వచ్చినట్లైంది. ఆయన స్థానంలో జైదీప్ అహ్లావత్ రావడం సినిమాకు మంచి బూస్ట్ ఇచ్చిందని బాలీవుడ్ కోడై కూస్తోంది.